Saturday, March 27, 2021

ఆనంద స్వాగతం (ప్లవ నామ యుగాది కవిత).

27/03/2021. (ఉగాది కవిరతలు వాట్సప్ లో)
"జనదీపిక " ఉగాది కవితల పోటీకి పంపినది.
శీర్షిక  : అనంద స్వాగతం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

అడుగడుగునా అడ్డు తగులుతున్న 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాణాళికల
ఉల్లంఘనలతో ,పాటు వికటించిన
ప్రకృతి ప్రకోపాల అతివృష్టి ,
అనావృష్టిల వర్ష ప్రభావానికి
పచ్చని పంటల విధ్వంశంతో పాటు,
సాగు నీటి కొరత వల్ల బీడు 
భుాముల సారహీన ఫలితాలతో
అన్నదాతలకు సన్నగిల్లుతున్న
ఆత్మస్థైర్యం, అడుగడునా 
ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది.
వికటిద్తున్న పర్యావరణ మార్పులకు
జన బాహుళ్యం, రోగగ్రస్థయై
మానవ సంబంధాల మాట మరచి 
మారణ హోమం చేస్తోంది.
ప్రతీ సంవత్సరం సశ్యశ్యామలమై,
పచ్చదనపు కళలతో , సుమ సౌరభ
సోయగాలతో నిండిన వసంత 
కన్నెల చెలిమి కోరుతుా, వన 
విహారానికి వచ్చే ఉగాది కన్య..
దేశ అన్నదాతల విషమ పరిస్థితి కి
విస్తుపోతుా ,  నీటి వనరులను 
సమృద్ధి పరచే ప్లవ నామ చెలియతో
పరుగు పరుగున వస్తోంది.
ప్రకృతి పచ్చదనాన్ని తిరిగి పెంచేందుకు. 
పర్యావరణ రక్షణ చేసి మనకు
ఆరోగ్యామృతం పంచేందుకు.
 రండి...అమె ఆగమనానికి 
 ఆనంద స్వాగతం చెపుదాం .


No comments:

Post a Comment