రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : మనిషి మారాలన్న.
మనసు మనసో యనుచు మన నెేమి లాభమది
మనసు మాటను విన్న మనిషెవడు ధరలోన॥
మనసు మంచిని చెప్ప మనిషి బుద్దెరుగదుగ
మాయ మాటల జెప్పి మనసణచి వేతురుగ ॥
నా ఇల్లు నా వాళ్ళు నాది నాదని కోరి
నమ్ము వారిని గుాల్చె సొమ్ము సోకుల కన్న
స్వార్ధ మదె పెరుగగా వ్యర్ధ జీవిగ మారి
వేల తప్పుల జేసి వెతలెన్నొ పడుదురుగ ॥
-------------------------------------------------------
ధనము కొరకై పోరు ధనము కొరకే హోరు
జనము నమ్మిన నోటు ధనముకమ్మిరి ఓటు॥
ధన మదముతో మనిషి తన -పరల నెరుగకను
అధికార బలము తో ఆధిపత్యము జేసె॥
మితిమీరె పరిధులు అతివ కవమానములు
కన్నీటి కార్చిచ్చు కరిగె సిరి సంపదలు॥
నాడున్న సుఖ శాంతి నేడు జగతిని లేదు
అన్ని తెలిసీ మనిషి ఆశ వీడుట లేదు ॥
---------------------------------------------------
చదువున్న వారేమొ చవిలేని బ్రతుకేల
చదువు లేనివారదె చక్క పాలకులైరి ॥
అవగాహనాలోప మవని నిక్కటులేల
జనులెల్ల జడులైరి జడిసి పాలకులకుా॥
మానవత్వము తరిగె దానవత్వము పెరిగె
మమతానురాగాలె మట్టికలిసీపోయె॥
మార్పు రావాలంటె మనిషి మారాలన్న
ఇలనీశ్వరీ మాట ఇచ్ఛతో వినుమన్న ॥
-------------------------------------------------
No comments:
Post a Comment