అంశం : : మనసులో బలం -కరోనా తిరోగమనం.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : మన ఆరోగ్యం మన చేతిలో..
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021.
సంచలనం రేపే కరోనా ఆగమనం.
రెండు వత్సరాలుగా రేపుతున్న కల కలం .
మొదటి విడత చేసిన మారణ హోమం
మనుషుల్లో రేపింది మనో భయం.॥
తెలియని రోగానికై తర్జన భర్జనల తర్కం
సామాజిక దుారాలు,మాస్క్ ధారణలే వైద్యం.
పెరుగుతున్న దుారాలు మానసిక వ్యధలు
అవసరాల ఆటుపోట్లు అగని రాక పోకలు॥
అంటు రోగం రేపిన కార్చిచ్చు నిండిన అసహనం.
అందరిలో చెలరేగిన తెగువ నిండిన మనోబలం.
అన్ని వైద్య రంగాలుా కలిపి చేస్తున్న ప్రయొాగం.
విఫలమౌతున్న ప్రయత్నాల విధి వంచిత వలయం.॥
మనోధైర్యం సడలని మానవ మేధస్సు మధనం.
విజయ కేతనం ఎగరేసిన ముాలికల వైద్యం.
మన ఆరోగ్యం మన ,చేతల్లో చేరిన వరం .
త్వరలోనే కరోనా రక్కసి తిరోగమనం. ॥
---------------------------------------------------
ప్రకృతి వరాల ముాలికా ధనం ఆయుర్వేదం .
జగతి తరుా సంపదల గుర్తింపుకు నిదర్శనం ॥
(చెట్లను కాపాడండి. ప్రాణాలు నిలుపుకోండి.).
No comments:
Post a Comment