౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*ప్రత్యేక వృత్తాలు - ద్రుతవిలంబితము*
లక్షణములు : న భ భ ర
యతి : 7వ అక్షరము
ప్రాస నియమము కలదు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
రవికులోత్తమ! రామ! దయానిధీ!
భవభయాపహ! భాగ్యవిధాయకా!
భువనమోహన! మోహవినాశకా!
శివసఖా! హరి! చేసెద నీ నుతుల్
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
No comments:
Post a Comment