ఆంజనేయుడు!!!
============
వాయుపుత్రుడువానరదేవుడు
వజ్ర తేజుడుఅంజనీ తనయుడు ఆపదమొక్కుల మా ఆంజనేయుడు
రామబంటుడురాముని భక్తుడు శ్రీరామచంద్రమూర్తీ
రామదూత అతి బలవంత
రామరామఅంటూ నిన్ను ఎదలోతలచి మదిలోన కొలిచి
భక్తితో ప్రేమగా పిలిచి
మీ పాదాల దగ్గర ఎప్పటికీ నిలిచి
దైవంగానామస్మరణ చేస్తూ
ధ్యానంలో నిన్ను పూజిస్తూ
హృదయాన్ని చీల్చి
రావణా లంకలోకాల్చి
తల్లి సీతమ్మ జాడను తెచ్చి
రామయ్య కు ఇచ్చి ఇష్టపూర్వకంగా నీవు నచ్చి
తన గుండెలకుహత్తుకున్నాడు
శ్రీరాముడినీ ఊపిరిగా
శ్వాసలో భావిస్తాడు
నింగిలోకి రివ్వురివ్వున ఎగురుతూ
నిన్ను ఎంతో వేడుకుంటాడు
భక్తి భజన పాటలు పాడుతూ తండ్రికే పరిమితమవుతాడు
సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినావు కపీకిషోరుడా శివశక్తివంతుడా
నీవు ఎంతో అపురూపం
నీ ఒళ్లంతా రామ నామం
మనస్సులో స్మరిస్తూ ఉంటూ
రామా రామా అంటూ
రాముడానీవులేకుంటేనాకు రంది
చేసిన మేము నీ గుండెలో బంది
కన్న తల్లి సీతమ్మ కొరకు కష్టాలు పడ్డావు ప్రాణాలకు తెగించి పట్టాభిరాముడి భక్తుడి అయ్యావు
పాదాల చెంత చేరినావు భక్తితో కోరినావు రామబంటు గా మారినావు
కోటి భక్తులకు కొండంత అండ
వేస్తాము నీ మెడలోపూలదండ
రచన !!&&
========
గజ్వేల్ నాగరాజు&
గ్రామం దుద్దెడ&
మండలం కొండపాక&
జిల్లా సిద్దిపేట&
No comments:
Post a Comment