Wednesday, June 23, 2021

అంశం :పి.వి.నరసింహారావు శత జయంతోత్సవం.

తెలుగు వెలుగు సాహిత్య  వేదిక..
అంశం :పి.వి.నరసింహారావు శత జయంతోత్సవం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

క్రమ సంఖ్య : 127.

శీర్షిక : చైతన్య స్ఫుార్తి.

తెలంగాణా గడ్డ పై ఉద్యమ ప్రతిబింబం
నిజాం ప్రభుత్వ పాలనకు  నిశ్ఛయ ధిక్కారం.
కాంగ్రెస్ పార్టీ  కొదమ నరసింహం .
అత్యుత్తమ ప్రధానిగా ఎన్నికైన ప్రజా బలం ॥

న్యాయ పోరాటాల నాయకత్వపు శ్రేష్ట.
నిరంతర సంఘర్షణల విశ్వ విజేత
గురుకుల, విద్యా సంస్థల వరుస  సృష్టి కర్త.
జ్ఞాన విద్యా పరంగత బహుభాషా ప్రవక్త.॥

ఆర్ధిక , భుా  సంస్కరణల ఆపన్న హస్త.
విప్లవాత్మకోద్యమ  సంఘ సంస్కర్త.
సాహిత్య ఆకాడమీ పురస్కారగ్రహీత.
రాజ్యాంగ సవరణల రాజ నీతిజ్ఞ ॥

ఉమ్మడి తెలుగు రాజ్యాల ఉచ్ఛ పాలకుడు
మానవతా ధృక్పధాల మేధోమధనీయుడు
ముఖ్యమంత్రిగా ఎదిగిన మానవోద్ధారకుడు.
రాజకీయ చదరంగలో రాటుతేలిన రసజ్ఞుడు ॥

ఆర్ధిక సంస్కరణల విప్లవాత్మక  జ్యోతి
శాశన సభ్యత్వంలో అపర చాణిక్య స్పూార్తి
చరిత్రకెక్కిన ప్రజా చైతన్య దీప్తి.
సడలని వ్యక్తిత్వమది వేంకట నరసింహిుని కీర్తి ॥


No comments:

Post a Comment