Tuesday, June 22, 2021

గజల్ ప్రక్రియ నియమాలు.; వివరణ

*గజల్..గజల్..అలర్ట్..అలర్ట్*
(నియమాలు కొన్ని తెలుసుకుందాం)
*రెండు పాదాలు కలిస్తే ఒక షేరు*
ఇలాంటివి 5షేర్లు(5×2=పదివాక్యాలు) కనీసం రాస్తే అది గజలు.
*రాసిన ప్రతి  రెండు పాదాలలోని చివరి పాదంలో చివరి పదం ఒకటే ఉండాలి*. *వేరు వేరు పదాలు రాయవద్దు* .అదికూడా సమాన మాత్రలతోనే ఉండాలి.

*ప్రతి రెండు వాక్యాలలోని రెండవ వాక్యంలో చివరిపదానికి ముందు వచ్చే పదం ప్రాసపదమై ఉండాలి*
*.ఈ ప్రాసపదం రాసిన తరువాత పై షేరులోని చివరి పదం ఇక్కడ రాయాలి*

*.ప్రాసపదం ఒకేవిధమైన ఉచ్చారణ కల్గిన పదం ఒకసారి వాడిన పదం తరువాత షేరులో వాడవద్దు.వేరువేరుగా ఉండాలి*.

 *చివరి షేరు రెండుపాదాలలో ఏదో ఒక చోట కవిపేరు భావంలో కలిసిపోయేలాగా సమాన మాత్రలలో ఇమిడ్చి రాయాలి.*

గజలుకు ఫలానా అంశంపై రాయాలని ఉండదని పెద్దలంటారు.
కాబట్టి  శృంగారము..విరహము..ఉత్కంఠత చరుపు చమత్కారం ఆకర్షణ వర్ణనతో రసరమ్యంగా ఉండాలి.
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఘాటైన శృంగార రసం ఒలికించవచ్చు.
  గజలులో మాత్రల లెక్క ఉంటుంది.
షేరులోని వాక్యాల పదాలన్నీ సమాన సంఖ్యలో మాత్రలను కలిగి ఉంటాయి.
 వాక్యంలో నాలుగు పదాలు ఉంటే గానయోగ్యంగా ఉంటుంది.
ఆ నాలుగు పదాలు సమాన మాత్రలు కలిగి ఉండాలి.
   3..3...3..3 మాత్రల పదాలతో
4444..5555...6666...7777...8888 మాత్రలతో రాయవచ్చు.

గజలు రాయాలంటే 
చివరి పదం అన్ని షేర్లలో ఉండుటకు ఒకటి ఎంపిక చేసుకోవాలి.
గజలు రాయాలంటే
చివరి పదానికి ముందు రాసే ప్రాస పదాలు ఒకే ఉచ్చారణ కలిగినవి ఒక షెరుకు ఒకటి చొప్పున 5షేర్లకు 5 ఎంపిక చేసుకోవాలి.
ఇక మాత్రలు 3....4..5..6..7..8..ఏదో ఒకటి ఎంపిక చేసుకొని అన్ని పదాలు అదే మాత్రాసంఖ్యలో వచ్చేట్టుగా అమర్చుకోవాలి.ఇక గజల్ ఈజీ.
ముందు పెపరులో గజలు రాయండి.
ఆ తరువాత 
అన్ని షేర్లలో చివరి పదం సమాన మాత్రలతో ఒకటిగానే ఉందా లేదా
చూడండి.
చివరి పదానికి ముందు వేరువేరు ప్రాసపదం సమాన మాత్రలతో వేసినమా లేదొ చూడండి.
5షేర్లు రాశామా చూడండి.
చివరి షేరులో ఎకషకడైనా మనపేరు సమాన మాత్రల పదంగా ఇరికించామా చూడండి.
ఓకే అనుకుంటే మీ గజలు పోస్టుచేయండి.
ఒక షేరులో రెండు వాక్యాలు.
ప్రతి వాక్యంలో నాలుగు పదాలు గుర్తుపెట్టుకోండి.
         1          2            3             4
    |         |           | ప్రాస పదం|చివరి పదం|

ప్రాసపదాలకు ఉదాసరణ
వింతేనా
చింతేనా
ప్రీతేనా
ఇంతేనా
వంతేనా
పొంతేనా
వీటి తరువాత చివరి పదం వేరువేరు ఉండదు.ఒక్క పదమే అన్ని షేర్లలో చివరి పదంగా రిపీటవుతుంది.

ప్రతి వాక్యంలో నాలుగు పదాలున్నాయా ఉంటే అవి సమాన మాత్రలతో ఉన్నాయా లేదా చూడండి.

No comments:

Post a Comment