అంశం : దత్తపది.
సరము : వరము : కరము : నరము
1. ప్రక్రియ. తేటగీతి.
నర(న రము)నిండి నట్టిదౌ సాధు బుద్ధి
(సరము )లిడి సేవలను జేయు సహజ భక్తి
(కరము)లు కైమొాడ్చి కొల్చు ఘనపు ధనము
ధర(వరమ)ది జన్మ నాదు ధన్య మాయె ॥
2. ప్రక్రియ : పాట వెలది.
రుాపకర్త : శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
(నరము) లేని నాల్క నరుని కొసగి
ధనము (సరము) లకును దాసు జేసి
(కరము ) చేయు పనులు కలత రేప
కల(వ రము)ల బతుకు గాన వేల ॥
3..కందపద్యము.
(కరమున) చుాడామణి గొని
(సరముల)సరిదా ల్చి రామ సన్నిధి చేరన్
(వరముల) గొనిసీత వీడి , వా
నరముల)రేడుధ ధిదాటె నమ్మిక గనుమా ॥
No comments:
Post a Comment