Thursday, June 3, 2021

నవ్వు నవ్వించు

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : చిరునవ్వు. 

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర


శీర్షిక : నవ్వే సింగారం.


లేవగానే చిరునవ్వుతో  పలకరించు.
మనసులో మాలిన్యం తొలగి
రోజంతా ప్రసన్నంగా గడుస్తుంది

నలుగురితో నవ్వుతుా మాట్లాడు
అందరుా  నీస్నేహాన్ని కోరుతారు.
ఆపదలో ఆదుకునేది స్నేహితులే.

నవ్వు ఆరోగ్యానికి  సోపానం.
హాయిగా  నవ్వేవాళ్ళ ఆయువెక్కువట
నవ్వు నవ్వించడమే జీవితానందం .

కష్టల్లో ఆయుధం చిరునవ్వు
ఆత్మవిశ్వాసానికి  ఆలంబన చిరునవ్వు.
ఉమ్మడి కుటుంబాలకు ఊపిరి.

అతివకు అందం చిరునవ్వు.
బంధాల నిలుపు చిరునవ్వు.
పలకరింపుల పరవశం చిరునవ్వు 

నవ్వు నవ్వించు. నవ్వే 
నవరసాలకు  అందం.
నవ్వుతుా బతుకు .అదే
 జీవితానందం ॥

No comments:

Post a Comment