Saturday, June 5, 2021

తురగవల్గన రగడ నియమాలు

తురగవల్గన రగడ నియమాలు:
1.రెండు పాదాలు ఉంటాయి.
2.ద్విత్రిస్ర గతి (3+3-3+3--3+3+3+3) మాత్రలలో ఉంటాయి.
3.ప్రాస నియమం మరియు అంత్య ప్రాస నియమం ఉంటుంది.
4.యతిమైత్రి: 1.1 -5.1(మొదటి త్రిస్రములోని మొదటి అక్షరానికి ఐదవ త్రిస్రములోని మొదటి అక్షరానికి యతిమైత్రి)
5.ప్రాసయతి నియమం లేదు
6.లఘువు=ఒక మాత్ర,గురువు=రెండుమాత్రలుగా లెక్కించవలెను.

 *ఉదాహరణ* :
*మ* _హ_ తినందు కవులు రగడ- *మ* హిమలన్ని తెలుసుకొని *రి* /
 *వి* _హ_ గమల్లెనూహలందు- *వి* రతిలేక కలలు కని *రి* //

 *వివరణ* :
రగడను పరిశీలిద్దాం

మొదటి పాదము:
మహతి|  నందు| కవులు|  రగడ|-
 I  I  I        U I      I  I  I     I I  I
   3     +     3   +    3     +   3

మహిమ|  లెన్నొ|  తెలుసు|  కొనిరి|
 I   I  I      U  I      I  I    I     I   I  I
   3     +     3    +    3     +    3

దీనిని ద్వి త్రిస్ర గతి అంటారు.
దీనిలో 
ప్రాసాక్షరం--హ
యతిమైత్రి--- మ-మ
అంత్యప్రాసాక్షరం--రి
ప్రాసయతి నియమం లేదు.

రెండవ పాదము:
విహగ| మల్లె | నూహ| లందు|-
 I I  I     U I    U   I     U  I
   3   +   3   +   3   +   3
విరతి|  లేక | కలలు|  కనిరి|
I   I  I    UI    I  I  I     I  I I
   3   +   3   + 3    +   3
దీనిలో 
ప్రాసాక్షరము- హ
అంత్యప్రాసాక్షరము - రి
యతిమైత్రి- వి--వి



ఈ విధంగా రెండు పాదాలుంటే తురగవల్గన రగడ అంటారు.ఇది హయప్రచార రగడకు రెట్టింపు ఉంటుంది.

ప్రక్రియ: *తురగవల్గన రగడ*

లఘువు+ గురువు కాకుండా గురువు+లఘువు (సూర్య గణాలు న,హ మాత్రమె) తీసుకోండీ...🙏🏻🌺🙏🏻

రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
క్రమ సంఖ్య : 3.

శీర్షిక :  మినీ సుందరాకాండ .

రామ బంటు లంక జనెను
రామ కార్య మిదని మనెను.
రమణి  సీత  నచట జుాచి
రగిలి లంక గాల్చి తనెను ॥

అభయ మిచ్చె సీత కతడు
అభము శుభము నెరుగ డతడు
అభద్రతను విడిన  సీత
హనుమ భక్తి మెచ్చెను కడు ॥

రామ గురుతు సీత కిచ్చె
రమణి చుాడమణిని దెచ్చె ॥
రావణాసురునదె గుాల్చి
రాము డంత కపిని మెచ్చె॥

రామ సీత కడకు కలిసె
రామ రాజ్య మిలను వెలసె
రామ సీత కల్యాణమదె
రమ్య ముగను జగతి నిలిచె ॥

రామ నవమి పుణ్య దినము
రాక్షస  సంహరణ ఘనము
రమణి  సీత సంత సించె
రాముని పుాజింప మనము ॥



No comments:

Post a Comment