చిలకపలుకులు.
ప్రాణహిత కవుల సంగమం మరియు భేరి
సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించు కవితల పోటీ....
అంశం: పర్యావరణదినోత్సవం.
ప్రక్రియ : నవరత్నాలు.
నీవు జల్లిన విత్తనాలు రేపటి వృక్షాలు
నీ నా తేడా చుాపని నీడ పంచు స్నేహాలు
నీ సంకల్పమే జగతి నిండు పచ్చదనాలు.
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥
నేలతల్లి మట్టి సుగంధాల పరవళ్ళు.
నాట్ల కు నీరిడ నిత్య వసంతాలు
చేస్తాయి రోజుా పుాలుా పళ్ళ సంబరాలు
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥
చెట్లు పర్యావరణ రక్షకు ముాలాలు.
చేల్లో పిల్లగాలి వీచి పసిడి వన పరిమళాలు
చేర గిరి ప్రాంతాలు వన ముాలికాధనాలు
నవరత్నాలు మానవ హిత కారకాలు!॥
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర.
No comments:
Post a Comment