Monday, June 7, 2021

దోబుాచులాడబోకు

అంశము: *చిత్రకవిత*
 రాగం :  కల్యాణి .
 శీర్షిక :లలిత గీతం .
దోబుాచులాడబోకు...ముద్దుల కన్నా..
రచన : 
శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.

పల్లవి:
దోబుాచులాడబోకు  ముద్దులకన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా॥

అను పల్లవి:
చిలికి వెన్న పాలు పెరుగు నైవేద్యముగా 
నీకు కలిపి తెచ్చినాను కల్ల కాదుర కన్నా ॥

చరణం:
చిత్తములో నీరుాపు చిన్మయానందమౌ
జ్యోతిగా నిలిపితినీ చుాడర కన్నా
ఆ జ్యోతి వెలుగు తోటలో 
భక్తి నిండు పుాలు తెచ్చి
 పుజసేయ వచ్చినాను చుాడర కన్నా ॥
చరణం:
మనసునిండు వసంతమై 
గొంతుపాడె కోయిలై
భక్తి గీతి భావ భరిత సంగీతమై
నా నోట పలుకు భావగీతి 
నీదు మురళి పాట రీతి
వినిపించర వేడుకగా వరదా కన్నా  ॥

చరణం :
నీ పదములె నా పలుకై
నా జీవము నీ కొరకై 
నిండు నుారు వసంతాల వరమిడు కన్నా..
నీ పదముల చిరు అడుగుల సడి
మురిపాల మువ్వల  సిరి
నా ఊపిరి లయగా నువు నిలుపర కన్నా ॥

-------------------------------------------------------
 

No comments:

Post a Comment