శ్రీ కళావేదిక వారి కవితల పోటీ కొరకు...
అంశం :వలస బతుకులు.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
శీర్షిక : నిండా మునిగిన జనాలు.
నోట్ల రద్దీతో మొదలైన బ్రతకు ఆరాటం.
సామాన్యుల నుండి రోజు కుాలీల వరకు
చేసే నిత్య జీవిత పొిరాటం.
అర్ధాంతరంగా ఆగిపోయిన వ్యవసాయాలు.
పనులు లేని బాటలో బడగు జీవిత వ్యధలు.
చేతిలో చిల్లగవ్వలేని చితుకు బ్రతుకులు
ఆకలితో అకమటించే అన్నార్తులు.
లాక్ డౌన్ తో అట్టుడికిన ఆశలు.॥
గుాడు వదలి రోడ్డున పడ్డ బతుకులు.
గమ్యం తెలీని బాటలో వరుస ప్రయాణాలు.
వలస జీవుల కష్టాలకు కాలే పాదాలే సాక్ష్యాలు.
పట్నం వీడిన దారుల్లో పడిగాపుల ఆక్రోశాలు
ఆకలి చావులు , దహనం కాని శరీరాలు.
రాజ్యాంగపుటెత్తుల రస లీలా భాష్యాలు.
తప్పట్లు తాళాలతో ఆశా బాసల ఆలింగనాలు.
మీ ఓటుకు మా నోటంటుా జనాల నమ్మకాన్ని
మత్తు తో చిత్తు చేస్తున్న చీడపురుగులు.
అధికార బాసల అరకాసు ఓదార్పులతో.
నమ్మకాల నట్టేట్లో నిండా మునిగిన జనాలు॥
రక్షించే నాధుడు కానరాని కరోనా ప్రకోపం.
భరత భుామిలో బిక్కు బిక్కు మంటున్న
భావి తరాల భవిత కిది తీరని శాపం॥
హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment