Monday, June 7, 2021

గంగమ్మ

10..05. 2021
మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజు  కవితా  పండుగే
పర్యవేక్షణ:  డా॥.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: .దాసరి  చంద్రమౌళి  గారు
సమీక్షణ: శ్రీ .టి.ఆర్.కె.కామేశ్వరరావు .గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :  అన్నీ తెలిసిన వాడు.

ప్రక్రియ : వచన కవిత.

పితృదేవతల ఉత్తమ గతి ప్రాప్తి కొరకు
భగీరధుడు చేసిన తపో ఫలము చేత
ఉరుకులు పరుగులతో ఉధృత తరంగిణియై
ఉరికి వస్తున్న గంగమ్మను  శివుడు తన
జటా జుాటంలో బంధించి , లోకంలో
జీవ,  జంతుల రక్షణార్ధఁం చిన్న ధారగా
భుామిపైకి ప్రవహింపజేసేడు. పవిత్ర గంగ
మానవుల పాప ప్రక్షాళన చేస్తుా ,సమృద్ధిగా
నదీ -నదాల లో నిండి , జన జీవితాలను
ఉద్దరించి పాప ప్రక్షాళన గావించింది.
అటువంటి గంగమ్మ విలువ గుర్తించని
జనులు పవిత్ర గంగను కలుషితం చేస్తుా..
కాలుష్యం నిండిన పర్యావరణానికి
పునాదులేసారు.స్వార్ధ పుారిత మానవులకు
అహర్నశలుా అమృతాన్ని పంచే గంగమ్మ 
అవమానితయై ఆవేశంతో ఉరిమి ఉరికింది...
ఊరుా-వాడా ముంచెత్తింది.
ఆగడాలకు' ఆవిరై ఇగిరి పోయింది
శాంతముార్తయైన గంగ కలుషితాల కంపుకు కనుమరుగై  పోగా పీల్చ ప్రాణవాయువు ,
తాగ మంచినీరు కరువైన జనులు
విష కణాల బారిన పడి వింత రోగంతో
విధివంచితులై ఊపిరాడక
ఊర్ధ్వగతులకు చేరుకుంటున్నారు.
పర్యావరణ కాలుష్యానికి  పొగబారి
నల్లబడిన మేఘాలచాటునుండి తొంగి
చుాస్తున్న పుార్ణ చందృడు..
మందులేని మహమ్మారి కంట పడకుాడదని
ముఖం చాటేశాడు. అన్నీ తెలిసిన ఆది దేవుడు
శిలరుాప లింగాకారుడై కనులు ముాసుకొని
యొాగ-నిద్రలోకి జారిపోయాడు.

.
హామీ;  ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని , నా స్వీయ రచన..

.‍

No comments:

Post a Comment