వాగ్దేవీ కళాపీఠం లో...
అంశం : ఏరువాక పుార్ణిమ
శీర్షిక :ఆనంద వేడుకలు.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర.
కవిత.
--------
వ్యవసాయ యజ్ఞానికి
భుామి పుాజ ప్రారంభం.
ఏరువాక పుార్ణిమది
సీతా యజ్ఞ మని నామం॥
వర్ష ఋతువు లో వచ్చిన
జ్యేష్ఠ శుద్ధ పుార్ణిమ.
రైతన్నల పరవశాల
రసవత్తర పండగ ॥
తొలకరి జల్లుల తోడుత
అరక దున్ను ఆనందం.
వ్యవసాయపు విధులకు
సాంప్రదాయ ప్రారంభం.॥
ఆనందపు సంబరాన
ఎడ్ల కు స్నానాలంకరణ
ఎడ్ల పుాజ లిడు లోగిలి
నైవేద్యం పొంగలి ॥
బండలాగు పోటీలకు
భలే భలే సందళ్ళు.
పుట్టింటికి ఆడపిల్ల లొచ్చే
సిరి మురిపాలు ॥
వప్ప మంగల దివసమంటు
వచ్చి కలియు రైతన్నలు
సాముాహిక సందడులతొ
దుక్కి దున్ను సంబరాలు ॥
No comments:
Post a Comment