అంశం : అనాధ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక .
కుళ్ళిన సమాజం.
--------------------------
మానవత్వం లోపించిన మనుషుల మతిలేని
చర్యలకు బలయ్యే మాంస పిండాలు.॥
చింకి చీరల ముాటల్లో చెత్త కుప్పల్లోకి చేరిన పసి ప్రాణాల కన్నీటి బాధా పుారిత అనాధ గాధలు ॥
కొవ్వెక్కిన కామానికి ,కోర్కె తీరిన మానానికి
బరువైన, భావి భారతి ఒడి జారిన ఆశా దీపాలు..
అందరుా ఉన్నా ఎవరుా లేని అనాధలు.॥
రాక్షసత్వం నిండిన రౌడీల పేటలో
అంగాంగ శోషణ శాపాలకు గురై , అడుక్కు తినే
ఆహారానికి కుాడా హక్కు లేని అభాగ్యులు అనాధలు॥
అభం శుభం ఎరుగని పసి కందులని కుాడా
చుాడక , అంగడిలో ఆటబొమ్మలుగా వెలకట్టబడి రాక్షసత్వపు రాసలీలలకు అరాచకంగా వ్యభిచార గృహాలకు చేర్చబడిన వేట బొమ్మలు అనాధలు॥
పట్టెడన్నం కోసం పుట్టెడు బాధల గాయాలని
కన్నీటి కావిళ్ళతో కడిగి తిరిగి లేస్తున్న
బతికున్న జీవశ్శవాలు అనాధలు.॥
బాలల దినోత్సవ అదర్శ భాషణల బరువుకు,
రాజకీయ రంగుల హంగులకు రాసి పోగులై,
అతఃపాతాలకానికి అణిచివేయబడ్ద
అసహాయ తోలుబొమ్మలు అనాధలు.॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని
నా స్వీయ రచన.
No comments:
Post a Comment