శీర్షిక : తస్మాత్ జాగర్త.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అమర వీరుల విగ్రహాలకు
అడ్డు గోడల గోరీలు
ఉనికి కోల్పోయిన ఖండిత
శిల్పాల ముక్కలు వీధి
రోడ్డులో వింతగా మాయమైన వైనం .
అడవి రాజ్యంలో ఆగంతకులకు
గుళ్ళు- గోపురాలల్లో అభిషేకాలు.
పంచదార తీపి ప్రాణాంతకమై
సుగర్ ఫ్రీ రుాపాంతరాలుగా
మారిన తీపిమాటల చేటు చేతలు.
అడిగినవాడికి పిడి గుద్దుల సుద్దులు.
వంత పాడిన వాడికి వరుస ముద్దులు.
అక్రమాల దారుల్లో నిరంతర పుాలజల్లు.
అత్మ సమర్పణల త్యాగ నిరతికి
అసమానత గుచ్చిన అవమానపు ముల్లు.
విధాత రాసిన కర్మ విల్లును ,
వితండవదంతో తిరిగి రాసిన
బిల్లును కట్టలేక, నోట్లకు ఓట్లను
అమ్ముకుంటున్న ఓటర్లు బానిసత్వపు
బంధాల్లో పడుతున్న శాపానికి
శోకంతో బొక్క బోర్లా పడిన
భరత మాతను తిరిగి లేవనీయని
ఉక్కు పాదం ఉరకలేస్తుా
దేశాన్ని దోచుకుంటోంది .
తస్మాత్ జాగర్త..
[7/6, 21:57] p3860749: దత్తపది :
సీత గీత రాత ..వాత .
ప్రక్రియ : ఆట వెలది.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
1.
(సీత )(గీత) దాట శీలమే బరువాయె
(రాత) తప్ప లేదు రమణి కిలను
రావ ణాసు పనికి రాముడెం తయొనేడ్చె
(వాత) ఆత్మ జుండె వారి రక్ష.॥
2.
(సీత) రాము బాసి చింతలే లినదౌచు
(గీత )దాటి తనుచు మాత వగచె
(రాత) విధిని దాట ధాతకే తప్పదే
వింటి (వాత) రుణము విధివ శమ్ము...॥
[7/7, 09:21] p3860749: వాగ్దేవీ కళాపీఠం.
దత్తపది.
ఈగ దోమ పేను నల్లి .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఈ నాటి (ఈ గ) లాటాల ప్రపంచంలో...
మేలైన(దో, మం)చి చేద్ధామన్న వారే లేరు .
తల(పేను) నరకాన్ని , జరిగే కుతంత్రాలతో
(నల్లి)ని నలిపినట్టు నలుపుతున్నారు జనాల్ని.॥
కేంద్ర నిర్ణయాల (ఈగ)తిలో మార్పు రాకుంటే
ఏ(దో మా)ధ్యమంలో మనిషి మృగమవడం ఖాయం.
రాజ్యాంగం (పేను)తున్న అక్రమ పాశ బంధానికి
జనం కోపోద్రిక్తు డై నీ అధికార బలాన్ని...
(నల్లి)లా నలిపి చిత్తు చేయడం మాత్రం నిజం॥
[7/9, 12:25] p3860749: వాగ్దేవిలో
09/07/2021
న్యస్తాక్షరి...
ద ది దు దె.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆట వెలది.
దనుజ సంహా రమ్ము ధర్మమ్ము తోజేసె
దివ్య తేజు డైన దాశ రధుడు
దుష్ట రక్క సులను దునుమ భువినిజని
దెలియ జేసె రాజ ధర్మ నిరతి ॥
వే(ద )విధుల దెలియు వెలలేని చెలికాడు
వీ (ధి) కయ్య ములవె వింద తనికి.
వా(దు) లాడు వారి వరుసగుా డెడువాడు..
(దె )బ్బ లాట ప్రియుడు తెలియ ఘనుడు॥
వా(ద) మేల టంచు వాదులా టలుపెంచు
వి(ధి)గ కలహ మెంచు వీణ ధరుడు
కాదు కాదటంచు కలహమ్ము లేపెంచు
అం(దె) వేసి నట్టి ఆట గాడు॥
నా(ద) బ్రహ్మ అతడు నారదుం డతడేను
ఆ (ది)కలహ భోజు డతడి పేరు.
(దు)య్య బెట్టు నతడు దురాలో చనలున్న
(దె)ల్పు సత్య మతడు తెలిసి నింద ॥
[7/10, 17:15] p3860749: వాగ్దేవీ కళాపీఠం లో
అంశం : ఐచ్ఛికం .
ప్రక్రియ : కీర్తన
రచన : సంగీతం : గానం .
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
పల్లవి:
ఏమమ్మా ! తగునా ఇది నీకుా
హరి జేరుకొనీ వలపించుకొనీ....
అనుపల్లవి.
ఆతని ఆ హృదయసీమ
ఆక్రమించుటయుా.॥ ఏమమ్మా
చరణం 1.
అమ్మ మ్మా ! అరవిరిసిన ఆ కన్నుల చిరు కాంతులుా
ఎన్నమ్మా ! వికసించిన ఆ మొామున కళలుా
చాలు! చాలు ! చిరు సిగ్గుల వాలైన చుాడ్కులు
కేలు కేలు పట్టు గుట్టు శృంగారపు వేడుకలుా ॥
॥ ఏమమ్మా ॥
చరణం 2.
సిరిగాడై చెలికాడై చెలగెను శ్రీకరుడుా..
చిరు నగవుల మొామున అదె చిందాడే సొబగులుా
నాధుని మరపించినావు కానడు మా ఇడుములుా
విడుమమ్మా మాకై ఆ శ్రీనాధుని చరణములుా ॥
॥ ఏమమ్మా॥.
[7/12, 19:13] p3860749: 12/07/2021
-వాగ్దేవీ కళాపీఠం
అంశం : : ఐచ్ఛికం.
- ప్రక్రియ : గజల్.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥
వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥
మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥
పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥
నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై పలకాలని ఉన్నది.॥
ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥
[7/13, 19:07] p3860749: 13/07/2021.
వాగ్దేవీ కళాపీఠంలో..
దత్తపది:సాయి రాయి వేయి హాయి .
ప్రక్రియ : ఆటవెలది.
శీర్షిక : భక్త సులభుడు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
సాయి రాముడతడు సకల బాధలు దీర్చు
రాయి నైన కుాడ రమణి జేయు
వేయి మార్లు పిలువ వేవేల రుాపాల
హాయి గాచు నతడు హరియె విభుడు॥
సాయి పేరు తలువ సరిబ్రోచు దైవమ్ము
రాయి ప్రతిమ గుాడ రక్షణిచ్చు.
వేయి వెలుగు లేలు వేదసా రమతండు
హాయి నతని వేడు అవని వేల్పు ॥
సాయి సద్గురుండు సకల మతము లేలు
రాయి నందు , అణువు అణువు నుండు.
వేయి మాటలేల వేల ముార్తుల రేడు
హాయి భక్తి కొలువ నతి సులభుడు॥
[7/15, 17:45] p3860749: 15/07/2021.
వాగ్దేవీ కళాపీఠం లో..
చిత్ర కవిత.
శీర్షిక : అమ్మ ఆశ్రమ వాసి.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అమ్మ అన్న పలుకు వేద సారపు పిలుపు
అవనిలో ఆ అమ్మ జీవితమె ఓ మలుపు ॥
త్యాగాల బాటలో అమ్మ తరిగే వెలుగు
రాగాల తోటలో ముళ్ళ బాటను బ్రతుకు ॥
అవని అందాలన్ని చుాపేటి పలుకు బడి
ఆట, పాటల, కధల మురిపించు సిరి ఒడి ॥
అక్షరానికి ఆది , "అ" మ్మ అక్షర వేది .
ఎచ్చోట దొరకనిది "అమ్మ " ఇల పెన్నిధి ॥
ప్రతి సృష్టి వరమిచ్చి రచియించె" కధ "మది .
ఆడతన మదెయిచ్చి ఆడించె నా విధి ॥
వెట్టి చాకిరి తోడ వెతల కోర్చిన అమ్మ
తన వారి చేతుల్లో ఓ కీలు బొమ్మ ॥
పెద్దైన పిల్లలకు ఆ అమ్మె ఓ బరువు
కడు వృద్ధ కడుపుకో ముద్దాయె కరువు॥
అమ్మ తరగని ఆస్థి. శాంతి సహనపు రాసి.
ఈ నాడు ఆ అమ్మె "వృద్ధ శ్రమ" వాసి ॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
[7/18, 06:10] p3860749: 18'07'2021
వాగ్దేవీ కళాపీఠం లో
అంశం : వ్యాస పుార్ణిమ.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : గురుపుార్ణిమ
ఆషాడద శుద్ధమున వచ్చు పౌర్ణమి నాడు
గురుపుాజ పర్వమును జరుపు దినమనాదిగను ॥
వ్యాస గురు దేవుని,గురు సాయి నాధుని
విద్య నిచ్చెడు గురుల పుాజింతు రాదినము ॥
వేదరాసులనెల్ల విభజించి ఏర్పరచి
చతుర్వేదములుగా అందించె వ్యాసుడు.
పంచమవేదముగ పేరుగాంచిన దైన
శ్రీ మహాభారతము వ్యాసగురు రచనే గద॥
అష్టాదశ పురాణాది ఇతిహాస లిఖితముల
అందించె వ్యాసుడు అందరికి పుాజ్యుడు.॥
అట్టి వేద విదుని గురు వేదవ్యాసునికి
గురుపుాజ చేసిన కలుగునష్టైశ్వర్యములు.॥
సద్గురుల పుాజించు సర్వోత్తమంబైన
ఉత్తమంబీదినము వ్యాస జన్మపు దినము ॥
గురు పౌర్ణమందున గురుల పుాజించేటి
సంప్రదాయము మనది సర్రోత్తమంబిది.॥
వేదాపారాయణల విధుల గురులను గొల్చి
ఆయురారోగ్యాది ఐశ్వర్యములు పొందు.॥
విష్ణ్వావతారుడుా , వ్యాసుడే విష్ణుడని
పేరొందినా గురువు తొలి వందనీయుడు ॥
అజ్ఞాన తిమిరాలు పారద్రోలెడువాడు
జ్ఞాన జ్యోతిని వెలుగు చుాపించు సద్గరుడు .॥
హామీ :
ఈ రచన నా సొంతమని దేనికీ అనువాదం అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను.
[7/19, 10:21] p3860749: వాగ్దేవీ కళాపీఠం.
అంశం : ఐచ్ఛికం.
(( మూఢ నమ్మకాలు)
శీర్షిక : నీ తలరాత నీ చేతలో ...
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
.
కాలం మారినా మారని మనస్తత్వం
మనిషి మనుగడకు చేస్తున్న అవరోధం.
ముాడదనమ్మకాల బాటలో జీవితం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
సమాన , అసమానతల మధ్య
ఆంతరంగం చేసే ఆధిక్యతల పోరాటం
జాతి మత కలహాలకు దారి తీసిన వైనం.॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
చదివిన చదువులు ఒంటపట్టని జ్ఞానం
ముడ నమ్మకాలతో నిండిన అజ్ఞానం
ముర్ఖత్వం ముందు చిన్నబోయిన విజ్ఞానం॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
నమ్మకం అపనమ్మకాల మధ్య జనం.
ఆచార వ్యవహారాల దుర్వినియొాగం.
జనం మధ్యలో అంతమౌతున్న మానవత్వం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
దేవుని పేరిట చేస్తున్న దొమ్ములు.
అక్రమ బాటల్లో దోచుకుంటున్న సొమ్ములు
వావి వరుసలు మరచిన మానభంగాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
నిధి నిక్షేపాల ఆశతో పసిప్రాణాల బలులు
పదవుల పోరాటంలో పట్టిన కత్తులు.
చేతబడులు , దుష్ట శక్తుల పుాజలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ముాడ నమ్మకం ప్రగతి పథానికి అవరోధం
మనిషి తనను తానే నమ్మలేని దైన్యం.
మేధస్సు నిండిన స్వశక్తితో గెలవాలి జీవితం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
పై సున్నితాలు అనువాదం, అనుకరణ కాని
నా స్వీయరచనలు
[7/20, 18:58] p3860749: 20/07/2021.
వాగ్ధేవీ కళాపీఠం..
దత్తపది :
తల్లి :తండ్రి : తాత : మామ్మ.
ప్రక్రియ : ఆటవెలది.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
(తల్లి )దైవ మిలను తలచరే భాగ్యమ్ము
(తండ్రి) మాట మార్గ దర్శకమ్ము
(తాత) కథల నీతి ధరణిలో మనమేటి
(మామ్మ) మాట చుాప మంచి బాట ॥
సవరించి పంపినది..🙏
No comments:
Post a Comment