గజల్
క్షణాలలో రాలిపోయె
పూలదెంత దిగులో
హృదయంలో వాడి పో యె అశదెంత దిగులో
స్వర సరాలలో సంగ తులనె సవరించ లేక
గశాలలో దాగిపోయె
పాటదెంత దిగులొ
నిలుకడే లేని నిద్దపు నీడలలోన నిలిచి
నిజాలనే దాచిపెట్టి
మాటదెంత దిగులో
చీకటి చెరలాటల ఆటల బాటలలొ బడలి
కళలనొంపుకున్న చంద మామదెంత దిగులో
మల్లీ! నింగి రంగుల మెరిసే తారలనె చూచి
నీటిలోని ఈదులాడె
అలలదెంత దిగులో
రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
No comments:
Post a Comment