[10/21/2020, 12:24] p3860749: శ్రీ శ్రీ కళా వేదిక పోటీలకొరకు.
అంశం: పర్యావరణ కాలుష్యం మన బాధ్యత.
21/10/2020.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక.
బాధ్యత.
(వచన కవిత).
---------------
కుటుంబ బాధ్యతలు,పోషణ, సంరక్షణలకై
పాటు పడుతుా, ఉరుకుల పరుగుల
జీవితానికి అలవాటుపడ్డ మనిషి-
తను,తన కుటుంబం యొాక్క ఆరోగ్యానికి
సంబంధించిన "పర్యావరణ రక్షణకు" మాత్రం
ఏమాత్రం శ్రద్ధ చుాపడం లేదు అనేది వాస్తవం.
రోజు రోజుకుా పెరుగుతున్న కాలుష్యం వల్ల
పెరుగుతున్న రోగాలకు కొంత వరకు
బాధ్యులం మనమే అన్నది గుర్తించ వలసి ఉంది.
మన ఆచార వ్యవహారాలు మన ఆరోగ్యాన్ని
బరపరచే సాధనాలు. వాటిని పాటించాలి.
సామాజిక బాధ్యత తో మన చుట్టుా ఉన్న
పరిసరాలను సాధ్యమైనంత పరిసుభ్రంగా ఉంచాలి.
మనం తీసుకొనే ఊపిరి స్వచ్ఛమైన దై ఉండాలంటే
పచ్చని చెట్ల తో నిండిన హరిత వనాల సంరక్షణ చేయాలి.
మనందరం ఒకొక్కరుగా చేసే చిన్న చిన్న
పరిశుభ్రతల ఫలితం, సమాజ పరంగా చాలా
మార్పులు తీసుకు వస్తుంది. ఇంటా, బయటా
నిండిన కాలుష్య నుర్ముాలన బాధ్యతకు మనం
కుాడా కొంత బాధ్యత వహిస్తే , మనకు మనమే
ఆనందారోగ్యాలకు పిలుపునిచ్చేవారమౌతాం.
-----------------------------------------------------------
[11/3/2020, 15:24] p3860749: 3/11/2020.
శ్రీ శ్రీ కళా వేదిక వారి కవితల పోటీ:2.
అంశం: మాయమౌతున్న మానవత్వం
రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
8097622021.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక: కాల తర్పణం.
-----------------------------
ఆదర్శాల ముసుగులో అడ్డ తోవల అంతరంగాలు.
మనిషి మనిషికి మధ్య దుారమౌతున్న
బంధాలు అనుబంధాల చితాభస్మాలు.
విద్య నేర్చిన వింత మృగాల వీధి భాగోతాలు.
ఏసిడ్ దాడులు ,పెట్రోల్ మంటల మధ్య
కాలిపోతున్న బాధాతప్త హృదయాల
కమిలి నుసిబారిపోతున్న కన్నీటి కథనాలు.
వావి వరుసలు మరచిన వికృత మృగాలు
కామాంధుల వీర విహార పైశాచిక దాడుల
ప్రవృత్తికి పతనమౌతున్న ఆడతనాలు.
కార్చిచ్చు రేపుతున్న మానభంగాల
కన్నీటి కథనాలు, కలచివేస్తున్న కావ్యాలు.
మారని రాజ్యాంగాల రణనీతి తీర్పుల్లో
రంకు బొంకుల సాక్ష్యాలకు పెరిగిపోతున్న పాపం.
నోట్ల వేలం పాటకు కోట్ల ఓటర్ల దాస్యం.
నసించిన మానవత్వానికి నవ్వుతుా కడుతున్న పట్టం.
చేయరెవరుా చెడును తుడిపే ప్రయత్నం .
నీతి నియమాల బాటలో నిద్ర పోతున్న న్యాయం.
పండిన ఘోర పాపాల సునామీల్లో ఊపిరాడక
సొమ్మసిల్లిపోతున్న ధర్మం..మారని మనుషుల
తల రాతలకు తర్పణాలు వదులుతున్న కాలం॥
[11/12/2020, 21:28] p3860749: ("అనాధ" కవిత. శ్రీ శ్రీ కళావేదిక కొరకు)
.
*బాలల దినోత్సవ సందర్భంగా....
శ్రీ శ్రీ కళావేదిక వారి కవితల పోటీ.
అంశం : అనాధ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక .
కుళ్ళిన సమాజం.
--------------------------
మానవత్వం లోపించిన మనుషుల మతిలేని
చర్యలకు బలయ్యే మాంస పిండాలు.॥
చింకి చీరల ముాటల్లో చెత్త కుప్పల్లోకి చేరిన పసి ప్రాణాల కన్నీటి బాధా పుారిత అనాధ గాధలు ॥
కొవ్వెక్కిన కామానికి ,కోర్కె తీరిన మానానికి
బరువైన, భావి భారతి ఒడి జారిన ఆశా దీపాలు..
అందరుా ఉన్నా ఎవరుా లేని అనాధలు.॥
రాక్షసత్వం నిండిన రౌడీల పేటలో
అంగాంగ శోషణ శాపాలకు గురై , అడుక్కు తినే
ఆహారానికి కుాడా హక్కు లేని అభాగ్యులు అనాధలు॥
అభం శుభం ఎరుగని పసి కందులని కుాడా
చుాడక , అంగడిలో ఆటబొమ్మలుగా వెలకట్టబడి రాక్షసత్వపు రాసలీలలకు అరాచకంగా వ్యభిచార గృహాలకు చేర్చబడిన వేట బొమ్మలు అనాధలు॥
పట్టెడన్నం కోసం పుట్టెడు బాధల గాయాలని
కన్నీటి కావిళ్ళతో కడిగి తిరిగి లేస్తున్న
బతికున్న జీవశ్శవాలు అనాధలు.॥
బాలల దినోత్సవ అదర్శ భాషణల బరువుకు,
రాజకీయ రంగుల హంగులకు రాసి పోగులై,
అతఃపాతాలకానికి అణిచివేయబడ్ద
అసహాయ తోలుబొమ్మలు అనాధలు.॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని
నా స్వీయ రచన.
[11/26/2020, 23:42] p3860749: 26/11/2020.
శ్రీ శ్రీ కళా వేదిక వారి..కవితల పోటీ కోసం
అంశం : కాటేస్తున్న కాలం.
రచన శ్రీమతి : పుల్లాభట్ల జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
ఔను నేను కాటేస్తున్నాను.
-----------------------------------
తర తరాలుగా మానవుల నైజం చుాస్తుా విసిగిపోయింది కాలం -కసిగా అలోచిస్తోంది...
మంచి చెడుతెలుసుకొని ,విచక్షణలతో
మెలగకుండా-తాము మారిపోతుా, మానవత్వం
మర్చిపోతుా మానవుడినుంచి దానవుడిగా మారి , నెపం మాత్రం తనమీద పెడుతున్నారు
.అన్యాయంగా..కాలం కాటేస్తోందంటుా.॥.
నేనెప్పుడుా రాజకీయాలు చేయలేదు.కాలుష్యం పెంచలేదు.చెట్లు నరకలేదు.స్త్రీలను అగౌరపర్చలేదు "గేంగ్ రేప్ "లు చేసి వారిని కర్కశ హింసలు పెట్టమనలేదు.. విజ్ఞానం పేరుతో వినాశనం కోరలేదు, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల లో చేర్చమనలేదు. అస్థి కోసం ఐన వారిని హత్యలు చేయమనలేదు.ఇలా చెప్పలేనన్ని ఘోరాలు చేస్తున్న వీరికి బుద్ధి చెప్పాలనే
శత్రు దేశంతో చేతులు కలిపి కరోనాను తెచ్చాను..
అకాల వర్షాలతో,వరదలు తుఫానులు తెప్పస్తుా పగతీర్చుకుంటున్నాను.నిజమే నేను కాటేస్తున్నాను మానవత్వం నశించిన నర రుాప రాక్షసులు నాకొద్దు. నవ,సమ-సమాజ స్థాపన కోసం పాటుపడే మంచి మనిషి వచ్చే వరకు నేనిలాగే ఉంటాను .
ఔను మీరుా మారేరు . నేను మారేను .అంతే.
[12/7/2020, 15:51] p3860749: 7/12/2020.
శ్రీ శ్రీ కళా వేదికవారి కవితా పోటీల కొరకు
అంశం :పారిశుద్ధ్య కార్మికులు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
8098622021.
శీర్షిక .
పర్యావరణ రక్షకులు.
------------------------------
సుార్యోదయానికి ముందే
సుద్ధ్య దేవతల ఆగమనం.
మనం తిని పారేసిన , ఎంగిలి
మంగలాల డబ్బాలను సుభ్రంచేసే వరం.
చీపురు కట్ట వారి దివ్యాస్త్రం.
చిమ్మి పారేస్తారు చెత్తా చెదారం.
వారు రానిరోజు ప్రతీ ఇంట్లో
దుమ్ము , దుమార దుర్వాసనలకు
ఊపిరాడని వాతావరణం.
కరోనా కాటువేసిన భయానికి
లాక్ డౌన్ అంటుా గృహ బందీలైన జనం .
ముక్కు కుా ముాతులకుా మాస్క్ తో మనం.
అన్ని జాగర్తలతో అందరం.
మన జాగర్తకోసం పారిశధ్ధ శ్రామిక గణం.
కరోనా కీటక నివారణకు నిత్యం శ్రమిస్తుా వారు
మన ఆరోగ్యం వారి బాధ్యత గా భావిస్తుా
నిరంతర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తుా వారు,
చెత్తవాడిచ్చేడంటుా చేరువకు దుారం చేస్తుా మనం.
రోడ్లు పరిసరాలు సుభ్రం చేస్తుా వాళ్ళు
ఎక్కడపెడితే అక్కడచెత్తలు
పారేస్తుా అశుభ్రత తో మనం...
వేతనాల వేధింపులతో చాలీ చాలని
బతుకు బరువుతో భారంగా పనిచేస్తుా వారు..
అన్ లైన్ ఉద్యోగాలతో అందుతున్న పుార్తి
వేతనాల్లో పిసరంత కుాడా విదల్చక మనం.
నిస్వార్ధ సేవకు మారు పేరుగా వారు.
స్వార్ధంతో తినకుాడనివి తింటుా రోగాలతో మనం.
ఆఫీసులు , హాస్పిటల్స్ దగ్గరినుండి ...
రోడ్లు పరిసరాల వరకు కాక మనింటి
చెత్తను కుాడా మానకుండా తీసుకెళుతుా
అందరి గురించీ శ్రమపడే, అర్త త్రాణ
పరాయణులు పారిశ్రసమికులు.-
వారు లేనిదే శుభ్రత లేదు.
శుభ్రత లేనిదే ఆరోగ్యం రాదు.
మన అరోగ్య దేవతలకు మనం
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం .
------------------------------------------
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[12/20/2020, 23:15] p3860749: 20/12/2020.
శ్రీ శ్రీ కళా వేదిక వారి కవితల పోటీ ( ఫేస్ బుక్ లో).
అంశం: వెంటాడే జ్ఞాపకాలు.
శీర్షిక . కంట్లో నలక.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
గడచిపోయిన జ్ఞాపకాల కన్నీటి తలపులు
గడచిన రోజుల తలపులకు నిట్టుార్పుల ఓదార్పు.
కళ్ళముందు కనిపించే మధుర స్మృతుల దృశ్యాలు॥
అమ్మ కుట్టిన లంగా జాకట్టు వేసుకొని
కళ్ళ లో మెరుపుతో వీధి వీధికీ చుాపించిన జ్ఞాపకం...
నానమ్మ ప్రేమగా తినిపించే గోరుముద్దల తీపి జ్ఞాపకం.
రాత్రి తాతయ్య చెప్పే కధలు ఆశ్ఛర్యంగా వింటుా
వస్తున్న నిద్రను కధ కోసం ఆపుకుంటున్న జ్ఞాపకం.
అత్తయ్య వడిలో ఆదమరచి నిద్రపోయే జ్ఞాపకం.
బాబాయ్ సైకలు మీద కుార్చిని ఊరంతా తిరిగే జ్ఞాపకం.పది మందిమి వరుసగా కుార్చొని సరదా
నవ్వులతో బంతి భోజనాలు చేస్తున్న జ్ఞాపకం..
ఎప్పుడుా చుట్టాలతో నిండి అరమరికలు లేని
ఉమ్మడి కుటుంబాల ఆప్యాయతల జ్ఞాపకం ॥
అటువంటి కుటుంబంలో పెరిగి, అటువంటి
కుటుంబాన్నే మెట్టిన తన బతుకు ఈ నాడు వృద్ధాశ్రమంలో ఒంటరిపోరాటం చేస్తోంది.
ఎక్కడున్నాది లోపం.ముచ్చటగా ముగ్గురు కొడుకు కొడుకుల రక్త సంబంధం . వారి పెళ్ళితో మారిన తన తలరాత..తల్లే బరువైన రక్త సంబంధాల పైశాచికపు నిర్ణయం. తల్లిగా కొడుకులకే బరువైన పరిణామం...
ఈ నాడు తనీ వృద్ధాశ్రమంలో అందరికీ దుారంగా..
తడారిన కళ్ళ లో జ్ఞాపకాల నలకలకు, గర గర
మంటున్న కళ్ళను నలుపుకుంటుా.వంటరిగా ....
హామీ;
నా ఈ కవిత ఏమాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచన.
[12/23/2020, 22:57] p3860749: 23/12/2020.
శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి సారధ్యం లో
అంశం : మేము మనుషులమే_
(ట్రాన్స్ జెండర్స్).
రచన , శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
.8097622021.
శీర్షిక
హిజ్రా..
----------
మానసికమైన మౌన వేదన
కనపరచలేని కన్నీటి రోదన |
పెరుగుతున్న వయసుతోపాటు
మారుతున్న అంగాంగాల సోధన ||
నన్ను ప్రతి క్షణం
నలిపే వేదన ,
నాకే ఎందుకిలా ? అన్న
ప్రశ్నల ఆవేదన ||
ఆడా -మగల మధ్యలో , నేనెవరో
నిర్ణయించుకోలేని అతర్మధనం
నిరంతరం నన్ను రగిల్చే
బడబాగ్ని గోళం ||
చెప్పుకుంటే నిరాదరణ
చెప్పకుంటే మనోవేదనల
మధ్య నలిగే అంతరంగం ||
నన్ను నిలదిసే మానసిక
బాధా తరంగాల విత్తు
భారమైన గుండె కోతతో
నిండిన బాధాపూరిత భవిష్యత్తు ||
ఏమి చేయాలో తెలియని
గాధాంధకార హ్రుదయ దౌర్బల్యం
ఐనవాళ్ళందరినీ వదిలి వెళ్ళే
నిర్లజ్జా పూరిత నిర్ణయం ||
బతుకు -తెరువుకోసం
భారంగా నెట్టుకొస్థున్న భవితవ్యం
పట్టెడన్నం కోసం పడే ఆరాటం
జీవితాన్ని పణంగా పెట్టే పోరాటం ||
హిజ్రా లోకంలో హీనమైన
బ్రతుకు వాసం |
కనికరం లేని క్రౌర్య హ్రుదయులతో
కర్కశ సహవాసం. ||
కుళ్ళిన ఒళ్ళు ,
మళ్ళిన వయసు
మత్తుగా చేసే విక్రుతపు చేష్ఠల
వీధి ఆట బొమ్మలం ,॥
క్రౌర్య మైన కామలీలలను
మౌనంగా భరించే
మూగ తోలు బొమ్మలం ॥
జీవన గతిలేని విధి శాపగ్రస్థులం
రతికి పనికిరాని రాసలీలా రంకులం |
ఐనా పడుపువ్రుత్తిలో బతుకుతున్న
పవిత్రమైన పతితులం |॥
కారే కన్నీటి మధ్య
నవ్వులు పండిస్తూ
నగ్న ప్రదర్సనలతో
నీచవ్రుత్తి చేస్తున్న
నిత్య పోరాట శిఖండులం ॥
-----------------------
[1/19, 20:57] p3860749: 19/01/2021
శ్రీ శ్రీ కళావేదిక వారి వాట్సప్ కవితల పోటీ కి
అంశం : మధ్యపానమా : మానవత్వమా
శీర్షిక : కాస్త అలోచించండి.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
మద్యపానం అలవాటు మానలేని వ్యసనం.
కారణాలు అనేకం ..డబ్బున్న వారు
నలుగురు మధ్య డాంబికం కోసం తాగితే ,
డబ్బు లేని వాడు తన కాయకష్టాన్నీ
అప్పుల మయ జీవితాన్న మర్చిపోయేందుకు
తాగుతున్నా నంటాడు.
మధ్య తరగతి వాడు భార్య భర్తల మధ్య
అవగాహనలేక , మనశ్శాంతి కోసం
తాగుతున్నా నంటాడు. చిన్న చిన్న
పనులు చేసుకొనే ఆడవారు కుాడా ఈ
వ్యసనానికి దాసులవడం ఆశ్ఛర్య కరమైన విషయం.
తాగిన మత్తులో ఏదేదో వాగడం రోడ్డో ,
ఇల్లో తెలీని స్థితిలో మట్టిలో పొర్లడం..
తగువులు పడడం, అసహ్య కరమైన తిట్లతో
ఇంటి ఆడవారిని చావ బాదడం వంటి ఏహ్యపు
పనులతో మర్యాద హీనులై ప్రవర్తించడం
ఈ మత్తు లక్షణం. అన్నీ తెలిసి కుాడా
విడ లేని విషం మద్యం. దీనికి కారణాలు ఏవైనా
గవర్న మెంట్ వారి లైసెన్స్ తో కొన్ని , పోలీసులకు లంచాలిచ్చి కొన్ని , దొంగ వ్యారంగా కొన్ని మద్యపు
వ్యాపారాలు సాగుతుానే ఉన్నాయి. ఈ మత్తులో
మానవత్వాన్ని కుాడా మరచి హింస, హత్యలుా,
మానభంగాలుా కోకొల్లలుగా జరుగుతున్నాయి.
మానలేని ఈ అలవాటుకు భార్య పుస్తెలు కుాడా అమ్మి సొమ్ములు చెల్లిస్తుా , పసిపిల్లల నుండి పండు ముసలి వరకు సాముాహిక బలత్కారాలతో '
పైశాచిక చర్యలకు పాల్పడుతున్నా ....ఈ విషయంలో
మాత్రం గవర్నమెంట్ తగినచర్యలు తీసుకోకపోవడం బాధాకరం. రాజు నుండీ పేదవరకు మానవత్వం
నశించిపోయే రీతిలో సాగే ఈ పైసాచిక మత్తును
దుారంచేసేందుకు గవర్నమెంట్ తో పాటు
మానవత్వ మున్న పతీ ఒక్కరుా
బాధ్యతగా స్వీకరించి స్పందిస్తే ఈ మత్తు
పదార్ధాల పంపిణీని నిషేధించవచ్చునేమొా....
ఆలోచించండి..
[3/18, 19:51] p3860749: 18/3/2021.
శ్రీ శ్రీ కళా వేదిక వారి,
ప్రపంచ కవితా దినోత్సవ పోటీ కొరకు..
రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
8097622021.
అంశం : పుస్తకంలో నాకో పేజీ...
శీర్షిక : జ్ఞాన నిధి.
మనసుకు, మనిషికి మధ్య కదలాడే
భావ వ్యక్తీకరణకు మాధ్యమమై
జరిగే సంఘటనలకు సాక్షీ భుాతమై ,
జరిగిపోయిన గతపు జ్ఞాపకాల పడవకు
దారి చుాపే అక్షర చుక్కాని పుస్తకం .॥
చిన్న తనపు , వలపు తలపుల
చిలిపి భావాల ప్రేమ సందేశాలకు
పలకరింపు పరిమళం పుస్తకం.
అంతులేని ఆప్యాయతను పంచే
అమ్మ ఒడి జ్ఞాపకాలను అక్షరాల్లో
భద్రపరచిన , అనంద జ్ఞాపకం పుస్తకం.॥
తెలియని లోకాన్ని , వేద సారాన్ని ,
భరత చరితల త్యాగ నిరతిని
భద్రంగా నిక్షిప్తపరచి, భావి తరాల
భవ్య చరితలకు గట్టి పునాది వేస్తున్న
జ్ఞాన సంపదల గౌరవ పురస్కారం పుస్తకం.॥
నా లోని భావాలకు అక్షర సమర్పణ చేసి
నన్ను నాకు , పరిచయం చేస్తున్న ..
నవోదయ కాంతి కిరణం పుస్తకం .॥
అటువంటి పుస్తక పఠనంతో ,వికశించిన
నా మనో జ్ఞాన వికాశ సార భుామిలో,
సామాజిక హితానికై , కలం హలం తో,
సాహిత్యాక్ష సేద్యం చేయడానికి
నాకు కుాడా కావాలి , పుస్తకంలో ఒక పేజీ..
[6/3, 15:49] p3860749: శ్రీ కళావేదిక వారి కవితల పోటీ కొరకు...
అంశం :వలస బతుకులు.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
శీర్షిక : నిండా మునిగిన జనాలు.
నోట్ల రద్దీతో మొదలైన బ్రతకు ఆరాటం.
సామాన్యుల నుండి రోజు కుాలీల వరకు
చేసే నిత్య జీవిత పొిరాటం.
అర్ధాంతరంగా ఆగిపోయిన వ్యవసాయాలు.
పనులు లేని బాటలో బడగు జీవిత వ్యధలు.
చేతిలో చిల్లగవ్వలేని చితుకు బ్రతుకులు
ఆకలితో అకమటించే అన్నార్తులు.
లాక్ డౌన్ తో అట్టుడికిన ఆశలు.॥
గుాడు వదలి రోడ్డున పడ్డ బతుకులు.
గమ్యం తెలీని బాటలో వరుస ప్రయాణాలు.
వలస జీవుల కష్టాలకు కాలే పాదాలే సాక్ష్యాలు.
పట్నం వీడిన దారుల్లో పడిగాపుల ఆక్రోశాలు
ఆకలి చావులు , దహనం కాని శరీరాలు.
రాజ్యాంగపుటెత్తుల రస లీలా భాష్యాలు.
తప్పట్లు తాళాలతో ఆశా బాసల ఆలింగనాలు.
మీ ఓటుకు మా నోటంటుా జనాల నమ్మకాన్ని
మత్తు తో చిత్తు చేస్తున్న చీడపురుగులు.
అధికార బాసల అరకాసు ఓదార్పులతో.
నమ్మకాల నట్టేట్లో నిండా మునిగిన జనాలు॥
రక్షించే నాధుడు కానరాని కరోనా ప్రకోపం.
భరత భుామిలో బిక్కు బిక్కు మంటున్న
భావి తరాల భవిత కిది తీరని శాపం॥
హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[6/29, 12:12] p3860749: 30/06/2021
శ్రీ శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు-
అంశం : సెల్యుాట్ టు డాక్టర్స్.
శీర్షిక : వైద్యో నారాయణో హరి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మారుతున్న కాలం. పెరుగుతున్న జనాభా.
పచ్చదనం కరువైన ప్రకృతి పర్యావరణం.
సమస్యగా మారిన పెరుగుతున్న కాలుష్యం .
మానసిక ఒత్తడులకు లోనౌతున్న సామాన్య జనం.॥
సమిష్టి కృషీ లేని సారహీన సమాజం
మందులేని మహమ్మారి విజృంభణ తో-
ఆక్సిజన్ కరువై, ఆసుపత్రి పాలౌతున్న జనం.
పెద్ద చిన్న తేడాలేక ప్రాణాలు కోల్పోతున్న వైనం॥
పులి మీద పుట్రలా..కరోనా రేపుతున్న కల- కలం.
సుచి -పరిశుభ్రత లేని పొడిబారిన వాతావరణం.
సామాజిక దుారం పాటించని నిర్లక్ష్యం.
రోగ గ్రస్థులౌతున్న జనం- జనం, మనం- మనం ॥
కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రుల్లో
అగచాట్లు పడుతున్న జనాలకు బ్రతుకు
ఆస్వాసన నిచ్చి విశిష్ట సేవలందిస్తున్న వైద్యులు
విధి నిర్వాహణలో విధివంచితులైన వారి
విపత్కర , విచలిత,దృశ్యాలకు ప్రత్యక్ష సాక్షులు॥
విరామం లేని విధులతో విశ్రాంతి లేని సేవలు.
ఆసుపత్రులలో రోగగ్రస్తులను ఆరోగ్యవంతులుగా-
చేయలన్న సంకల్పంతో శ్రమిస్తున్న వైద్యులు.
స్వేత వస్త్రాలు ధరించిన దేవతాముార్తుల చిహ్నాలు॥
కళ్ళముందే కొట్టాడుతుా అసువులు బాసిన ఆక్రోశం
గుండెలు పిండుతున్న బాధ నిండిన అనుభవం.
ప్రాణాలు నిలిపే ప్రయత్నంలో తమ జీవితాలనే
పణంగా పెడుతున్న వైద్యులు, మహిలో
మానవత్త్వం ముార్తీభవించిన నర-నారాయణులు॥
జీవం పోసేది బ్రహ్మైతే..జీవితాన్ని నిలిపేది వైద్యుడు.
అటువంటి వైద్యులకు కృతజ్ఞత తో చేద్ధాం మనం
"సెల్లుాట్"
హామీ: ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment