చిత్రకవిత
శీర్షిక :చెట్టు తల్లి.
ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రాణ మున్న గాని పలుకలే నిదిసుమ్మ
మట్టి లోన పుట్టు చెట్టు అమ్మ ॥
పచ్చ దనము తోడ పంచుసు ఖముమిన్న ॥
మనిషి కారోగ్యమ్ము మహిని పంచు ॥
ప్రాణ వాయు విచ్చి ప్రజల గాచెడు బ్రహ్మ
విషపు గాలు లన్ని విధిగ పీల్చు
నరికి వేయ నరుని నట్టింట నిడమేలు
ఇంధ నముగ మారి ఇచ్చు బ్రతుకు॥
పర్య వరణ మెల్ల పట్టిబా గుగచేయు
పనిని శ్రమతొ చేసి పంచు సుఖము
పండ్లు పత్ర ములతొ పరులపొ ట్టనునింపి
పరవ సించే తల్లి పనికి ఘనము ॥
నిత్య మొార్మనినిల్చు నీడ నిచ్చు చెట్టు
పక్షు గుాడు లిడిన పరవసించు
కుాల్చి వేయ నరుడు కుార్మిమొలకలిచ్చి
నరుని గాచు తల్లి ' నరుడె ద్రోహి ॥
No comments:
Post a Comment