Wednesday, July 28, 2021

సి.నా.రె..సాహితీ ప్రస్థానం

18/07/2021.
శీర్షిక :  సి.నా.రె.సాహితీ ప్రస్థానం .

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.

"నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర"  అంటుా
కలాన్ని ఝళిపించి కవిగా
గణుతికెక్కిన  సి. నా. రె .॥

బాల్యం నుంచే సాహిత్య
కళలకు ఆకర్షితులైన సి.నా.రే
తన సాహితీ ప్రస్థానం  లో
ఆధునిక "విశ్వంభర" వచన
కావ్య రచనకు  ప్రతిష్ఠాత్మకమైన
జ్ఞానపీఠ పురస్కారాన్ని గ్రహించేరు.॥

"బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా"
అంటుా మానవ వికాశ చైతన్యాన్ని

"వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును"
అంటుా మానవ ప్రస్థానంలో, మజిలీల
కాలస్వరుాపాన్ని తన రచనల లో
సాక్షాత్కరింపజేసిన  గొప్పకవి సి నా.రె ॥

"గులేబకావళి కథ "చిత్రం తో
ప్రారంభమైన  సీనీ ప్రస్థానం..
పలు సాహిత్య రచనల కవన
విహారాల వెనుతిరిగి చుాడని వైభవం ॥

విద్యాత్మకంగా,పాలనా పరంగా
ఎన్నో పదవులు నిర్వహించి .
సాహిత్య సౌరభాలనందించి
సి.నా.రె.గా పిలవబడుతున్న
సంగిరెడ్డి నారాయణరెడ్డిగారు
మన దేశ  ఘన గౌరవం ॥

No comments:

Post a Comment