అంశం: ప్రపంచ జనాభా పెరుగుదల - నష్టాలు
శీర్షిక: ఓ మనిషీ ! మేలుకో.!
కవిత :
క్లిష్ట మైన దేశ పరిస్థితి. కష్టమైన మనిషి జీవన స్థితి. పెరుగుతున్న జనాభా వల్ల నిండుతున్న స్థలాలు.
కరువౌతున్న వనరులు. బరువౌతున్న బతుకులు.
.తరుగే పచ్చదనం. కరువౌతున్న ప్రాణవాయువు
పెరిగిన జన కాలుష్యం .వన జీవుల స్వైర విహారం.
కరువౌతున్న వర్షపాతం వల్ల పొడిబారిన భుామి .
తడి లేని మట్టిలో సారహీన మడులు
ఎండిపోయిన నదీనదాలు .కొరత బడిన నీరు.
నిరక్షరాస్యత నిండిన భవిత.ఉద్యోగాలు లేని యువత
సంపాదన లేని సంసారాల్లో బరువైన రోగాలు.
నిండుతున్న ఆసుపత్రుల్లో కరువైన వైద్యులు
బరువైన వైద్యం కాటికి పోతున్న ప్రాణాలు.
అంటు రోగాలు , అనారోగ్యాలతో
అట్టుడికి పోతున్న జనాలు. ఆకలి చావులు.
ప్రణాళిక లేని జనాలకు అందించలేని పథకాలు
జనాభాలెక్కల జోరుతో కేంద్ర పాలనా వైఫల్యత
వీటన్నటి కారణం, జనాభా పెరుగుదల.
ప్రభుత్వ సంక్షేమ పథకాల రుాప కల్పన--
వెనుక బడిన వర్గాల వారికై ప్రత్యేక ప్రణాళికలు,
అమలు పరచే విధానాలకు, జనాభా లెక్కల ప్రాముఖ్యతను అందరుా అవగాహన చేసుకొని
జనాభా నియంత్రణకు సహకరించాలి.
అప్పుడే మన దేశ పరిస్థితి మెరుగై ముచ్చటైన
రీతిలో మనం ముందడుగు వేయగలం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
No comments:
Post a Comment