వారం వారం కవిత లో
అంశం: అమ్మ.
శీర్షిక : త్యాగశీలి అమ్మ.
పల్లవి:
అనురాగం అభిమానం నిండిన కొమ్మా
ఇల వెలసిన దేవత గద అమే అమ్మా..॥
అను పల్లవి:
కనరాని శాంతమే కొరత లేని సహనమే
ఆ రెండుా కలిసిన ఒక త్యాగముార్తి అమ్మా ॥
చరణం.
ఒడి బడిగా చేసి , ప్రేమ పలుకు పంచి పెంచి
తొలి అడుగుల నిలకడకే ఆధారమె అమ్మా
మన భవితే తన బ్రతుకని
మన ఘనతే తన సుఖమని
తలచి తలచి మురిసేటీ అనురాగమె అమ్మా ॥.
చరణం:
తల్లిపాల అమృతమే మన జీవము సుమ్మీ
తల్లి కష్టమే, పెరిగే మన కాయము తమ్మీ
తను తిన్నా లేకున్నా కడుపు నింపు మనకన్నా
కలిమిలోన లేమిలోన మన బలమే కద అమ్మా ॥
చరణం:
పనులెన్ని చేసినా , తనువెంత అలసినా
సుఖము కోరి సేదతీర తలవదామె అమ్మా..
తన వారి సౌఖ్యమే తన జీవితమని తలచి
తన కోస మొక క్షణం కోరదామె అమ్మా ॥
చరణం:
జవసత్వాలుడిగి వృద్ధాప్యమె చుట్టుముట్ట
కన్న పేగు చేయు తప్పు కాచు న్యాయమమ్మా
అవమానం చేసినా ఆశ్రమాల తోసినా
కన్న బిడ్డ సుఖము కోరి దీవించేదమ్మా ॥
ఈ పాట ఏ మధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
No comments:
Post a Comment