వాగ్దేవిలో
09/07/2021
వాగ్దేవిలో
09/07/2021
న్యస్తాక్షరి...
ద ది దు దె.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆట వెలది.
దనుజ సంహా రమ్ము ధర్మమ్ము తోజేసె
దివ్య తేజు డైన దాశ రధుడు
దుష్ట రక్క సులను దునుమ భువినిజని
దెలియ జేసె రాజ ధర్మ నిరతి ॥
వే(ద )విధుల దెలియు వెలలేని చెలికాడు
వీ (ధి) కయ్య ములవె వింద తనికి.
వా(దు) లాడు వారి వరుసగుా డెడువాడు..
(దె )బ్బ లాట ప్రియుడు తెలియ ఘనుడు॥
వా(ద) మేల టంచు వాదులా టలుపెంచు
వి(ధి)గ కలహ మెంచు వీణ ధరుడు
కాదు కాదటంచు కలహమ్ము లేపెంచు
అం(దె) వేసి నట్టి ఆట గాడు॥
నా(ద) బ్రహ్మ అతడు నారదుం డతడేను
ఆ (ది)కలహ భోజు డతడి పేరు.
(దు)య్య బెట్టు నతడు దురాలో చనలున్న
(దె)ల్పు సత్య మతడు తెలిసి నింద ॥
No comments:
Post a Comment