శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు-
అంశం : సెల్యుాట్ టు డాక్టర్స్.
శీర్షిక : వైద్యో నారాయణో హరి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మారుతున్న కాలం. పెరుగుతున్న జనాభా.
పచ్చదనం కరువైన ప్రకృతి పర్యావరణం.
సమస్యగా మారిన పెరుగుతున్న కాలుష్యం .
మానసిక ఒత్తడులకు లోనౌతున్న సామాన్య జనం.॥
సమిష్టి కృషీ లేని సారహీన సమాజం
మందులేని మహమ్మారి విజృంభణ తో-
ఆక్సిజన్ కరువై, ఆసుపత్రి పాలౌతున్న జనం.
పెద్ద చిన్న తేడాలేక ప్రాణాలు కోల్పోతున్న వైనం॥
పులి మీద పుట్రలా..కరోనా రేపుతున్న కల- కలం.
సుచి -పరిశుభ్రత లేని పొడిబారిన వాతావరణం.
సామాజిక దుారం పాటించని నిర్లక్ష్యం.
రోగ గ్రస్థులౌతున్న జనం- జనం, మనం- మనం ॥
కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రుల్లో
అగచాట్లు పడుతున్న జనాలకు బ్రతుకు
ఆస్వాసన నిచ్చి విశిష్ట సేవలందిస్తున్న వైద్యులు
విధి నిర్వాహణలో విధివంచితులైన వారి
విపత్కర , విచలిత,దృశ్యాలకు ప్రత్యక్ష సాక్షులు॥
విరామం లేని విధులతో విశ్రాంతి లేని సేవలు.
ఆసుపత్రులలో రోగగ్రస్తులను ఆరోగ్యవంతులుగా-
చేయలన్న సంకల్పంతో శ్రమిస్తున్న వైద్యులు.
స్వేత వస్త్రాలు ధరించిన దేవతాముార్తుల చిహ్నాలు॥
కళ్ళముందే కొట్టాడుతుా అసువులు బాసిన ఆక్రోశం
గుండెలు పిండుతున్న బాధ నిండిన అనుభవం.
ప్రాణాలు నిలిపే ప్రయత్నంలో తమ జీవితాలనే
పణంగా పెడుతున్న వైద్యులు, మహిలో
మానవత్త్వం ముార్తీభవించిన నర-నారాయణులు॥
జీవం పోసేది బ్రహ్మైతే..జీవితాన్ని నిలిపేది వైద్యుడు.
అటువంటి వైద్యులకు కృతజ్ఞత తో చేద్ధాం మనం
"సెల్లుాట్"
No comments:
Post a Comment