రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అంశం : వైద్యో నారాయణో హరిః.
శీర్షిక : నరులలో నారాయణుడు.
అస్తవ్యస్త జీవితంలో అసంతృప్తి .
కల్తీ సరుకులతో కమ్ముకున్న రోగాలు.
పెరుగుతున్న జనాల నిర్లక్ష్యానికి
తరిగే పచ్చదనం, పెరిగే కాలుష్యం.॥
కరోనా కరాళ నృుత్యానికి
తాళమేస్తున్న మరణ మృదంగం.
కరువౌతున్న ఆనందం, బరువౌతున్న వైద్యం.
భయం నిండిన జనంలో బ్రతుకు భయం ॥
ఆసుపత్రిలో కరువైన ఆక్సిజన్ .
వైద్యానికి లొంగని మహమ్మారి సేడిజం
ప్రయత్నం వీడని శ్రమకు నిదర్శనం .
శ్వేత వస్త్ర ధారణతో శ్రమించే వైద్య బృందం. ॥
పగలు రాత్రి ఎరుగని సేవా తత్వం.
ఐనా లెక్క చేయని మనస్తత్వం.
బ్రతుకు జీవితాలకు భరోసా నిత్యం.
వైద్యుడే నారాయణుడనడానికి నిదర్శనం .॥
అంటరాని రోగుల మధ్య అహర్నిశల పొిరాటం.
ఆపద్భాంధవులైన అంకిత వైద్య బృంద ఘనం. .
ఎంత పెద్ద దైన జబ్బునైనా, వైద్య పరికరాలతో కనుగొనగలిగే జ్ఞానం ముార్తీభవించిన నైపుణ్యం॥
ఎంతటి బాధకైనా సరైన ఉపశమన ఔషధాన్ని
ఈయగలిగే విజ్ఞాన పరమైన ప్రతిభగల వైద్యులు.
భువిని నర నారాయణులుగా కీర్తింపబడుతున్న
వైద్య బేముళ్ళకు ఇవే నా నమఃసుమాంజలులు.॥
No comments:
Post a Comment