రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : వాడిన గులాబీ
అపురుాపమైనది ఆడ జన్మ
సృష్టి కి ప్రతిసృష్టి చేసే భుాలోక బ్రహ్మ.
చెల్లిగా తల్లిగా మల్లిగా మమతలు పంచే ముద్దు గుమ్మ.
శాంతి సహనాలకు ప్రతిరుాపమైన అమ్మ.
ఆదరాభిమానాలను పంచే ఆదర్శ పుా రెమ్మ.
వైవాహిక జీవిత కష్టసుఖాలలో సరి భాగస్వామిగా
భర్త శరీరంలో సగభాగమై బాధ్యతలను -
బరువులనుా సమానంగా పంచుకునే కంటి చెమ్మ.
జీవితపు ఆటుపోట్లను తట్టుకొని సంసార-
సాగరానికి ఎదురీత ఈదే శక్తి స్వరుాపిణివమ్మ.
ఎన్నో సుగుణాలకు నిలయమైనా, అందమైన
గులాబీలా, ముళ్ళ మధ్య నలిగిపోతున్న నీ జీవితం....
కామాంధుల కర్కశత్వానికి బలైపోతున్నా .
అడుగడుగుకుా గుచ్చుకునే ముళ్ళ మధ్య
కామం నిండిన కాలుష్యపు గాలి ఎటు వైపు వీచితే అటు రెండో వైపుకు తుాలిపోతుా తుాగిపోతుా ,
ఆటుపోట్ల తాకిడికి ఛిద్రమౌతుా, లెక్క చేయకా
వలువలు తొలగిన కాయాన్ని కప్పుకుంటుా
కన్నీటి ధారలమధ్య మాన రక్షణకై
ముడుచుకుపోతుా దేహాన్ని చేతులతో
కప్పుకుంటుా...
క్షమించే ధరిత్రివై తిరిగి పుంజుకుంటుా..
తిరిగి మగ సంతానానికి జన్మనిచ్చి
స్థన్యమిచ్చి లాలించి పాలించి నీ
క్షీరామృతాన్ని పంచి పెంచుతున్న .ఓ స్త్రీ ...
నీ మహోన్నత వ్యక్తిత్వానికి ఇదే నా అంజలి.
No comments:
Post a Comment