గజల్
విరులు విరిసె తరువునైనా చేతులు మోడ్చేదెవరు కాలమా
ప్రేమ నీరంపోసి నను నిజంగా కాచేదెవరు కాలమా
నభం నీడ నలువుగా
నర్తించే రంగు ఈకల నమ్మిలా
పుడమి మీద పూల పల్లవినౌ నను చూచేదెవరు కాలమా
భరణి అసువులు కుసు మింపచేసె పలాశినై పలుకరించినా
మీ భవితవ్యమైన నాకై చూపు చాచేదెవరు కాలమా
మనసేలేని మండుటెం డలలో మాడి మసియై పోతున్నా
నా ఆవేదన ఆవౌ వరకు నను దాచేదెవరు కాలమా
పులుగులు పువ్వుల
నవ్వల పర్వమవాలనె
కోరిక మల్లీ!
తుంపి అది నా సహన సౌహృదాన్ని తూచేదెవరు కాలమా
రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
శీర్షిక : నా ప్రేమ..
ప్రక్రియ : గజల్
శీర్షిక : నా ప్రేమ. (సవరించి రాసినది).
ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలు నాచెలీ
ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన
బ్రతుకంత నీ తలపు బంధాలు నాచెలీ
నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలు నాచెలీ
నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
ఆకళలె కలలందచందాలు నాచెలీ
కదిలేటి ముంగురులె మేఘ సందేశమై
కవ్వించ ననుచేరు కందాలు నాచెలి
కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేతరంగాలు నాచెలీ
నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ
సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
వయ్యారి నీసొగసు విందులుా నాచెలీ
అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు వైవేయు సంకెళ్ళు నాచెలీ
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
మొదటిసారి రాసినది.👇
ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలె నాచెలీ
ఊహలో ఉయ్యాలలుాగేను నామదే
బ్రతుకంత నీతలపు బంధాలె నాచెలీ
నీపలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ విందులే నాచెలీ
నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
ఆకళలె కలలందు కందాలె నాచెలీ
కదిలేటి ముంగురులె మేఘసందేశమై
ననుచేరి కవ్వించు అందాలె నాచెలీ
కనులలో కదలేటి నీమౌన బాసలే
మనసులో మాటగా చేరెలే నాచెలీ
నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నీ వలపు పిలుపునాకండాయె నాచెలీ
సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
నీహొయలు నీసొగసు అందాలె నాచెలీ
అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు నీడగా ఉండాలె నాచెలీ
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా గజల్ ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన .
--------------------------------
శీర్షిక : మౌన ప్రేమ
నా మనసు పాడేను ఓమౌన గీతమే
ఆగీతి నీదిగా పలికెలే ప్రేమగా
ధారలై కురిసేను నా ప్రేమ చినుకుగా
విరహమే వేదనై మురిసెలే ప్రేమగా ॥
మనసదే కోరినది చెలినీదు చెలిమినే
చెలిచుాపు భావమై పిలిచెలే ప్రేమగా
పదములే పాటగా పాడెలే జంటగా
హృదినిండు శ్వాసలే కలిసెలే ప్రేమగా
మనసంత నిండెనీ రుాపమే అలలుగా
పదములే కవితలై కురిసెలే ప్రేమగా
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా గజల్ ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన .
********
ప్రక్రియ : గజల్ ..
శీర్షిక : అలనాటి జ్ఞాపకాలు .
అలనాటి రోజులని తలచేవు ఏలనీ
మారింది నీవనీ తెలుసుకోవేలనీ..
ఆగాలి ఆనీరు ఆపుడమి ప్రకృతీ
ఆనాటి వేననీ తలుచుకోవేలనీ ॥
బంధాలె బరువాయె ఈనాటి మనిషికీ
విడరాని బంధాల కలుపుకోవేలనీ ॥
ఆ అమ్మ ఆ అక్క ఆచెల్లి ఆచెలీ
ఆప్రేమ నీదిగా మసలుకోవేమనీ ॥
స్వార్ధమే జీవముా ధనమాయె ముాలముా
నిస్వార్ధ బాటలో నడుచుకోవేలనీ ॥
కరువాయె ధర్మముా బరువాయె బంధముా
అవినితి బాటనే వదుకోవేలనీ ॥
తరిగేను విలువలుా తొలగేను వలువలుా
మనదైన సంస్కృతిని మరచేవు ఏలనీ ॥
మేధావి తానని మారినది మనిషనీ
తెలిసినీ తలపులను మార్చుకోవేలనీ ॥
ఆనాటి కాలమే ఈనాడు ఉండగా
కాలాన్ని తిరగేసి వగచినావేలనీ॥
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా "గజల్ " ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
No comments:
Post a Comment