Tuesday, July 27, 2021

కలాం సుాక్తులు

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశసం : అబ్దుల్ కలామ్.
శీర్షిక : కలాం చెప్పిన  సుాక్తులు.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

50

అబ్దుల్ కలాం  ఆశయ సాధకుడు
భారతీయ అంతరిక్ష పరిశోధకుడు
సాంకేతిక అభివృద్ధిలో కృషీల్యుడు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
51.
ఆదర్శాల బాటలో ఆటుపోట్లు
అనుభవం నేర్పిన పాఠాలు.
అబ్దుల్ కలాం నేర్చిన సుాక్తులు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
52
.ప్రశ్నంచే విద్యార్ధి  గుణనిధి
ఆలోచనలతో కలుగు ఆశయసిద్ధి
అపజయాలే విజయానికి స్ఫుర్తి
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
53.
ఉత్తేజపరచు ఆలోచనల ఆకాంక్షలు--
అపజయాలు విజయానికి సోపానాలు
మీతలరాతకు మీరే సృష్టికర్తలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
54.
ఆలోచనలను పనిగా మలచుకో
ప్రతిభతో సమస్యలను ఎదుర్కో
మరణంతో చరిత్ర సృష్టించుకో
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
55.
పద్మభుాషణ్  పద్మవిభుాషణ్  భారతరత్న
డాక్టరేట్ లు  సాధించిన అవార్డులు..
అబ్దుల్-కలాంకు గౌరవ నివాళులు ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

No comments:

Post a Comment