Saturday, August 14, 2021

గో.ర.సం ఆగష్ట్ 15 కొిసం రాసున కవిత .

14/08/2021.

.గో.ర.సం... 75 పంద్రాగస్ట్ కవితల పండుగ కోసం.

అంశం: భారతదేశము-స్వాతంత్ర్యం .

శీర్షిక : అక్షర పోరాటం.

ఎందరెందరో అర్పించిన ప్రాణాలు
భుామిపొరల్లో ఇంకిపోయిన రుధిరధారలు.
నేటి స్వాతంత్ర్యపు సుఖానుభావాల బాటలో
అడుగడుగునా గుర్తుకు వచ్చే నాటి
ఉద్యమకారుల శాంతియుత పోరాటాలు.॥

స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఐదేండ్లు  పైబడినా
నేటికినీ వీడిపోని బానిసత్వపు సంకెళ్ళు.
జాతి మత విభేదాలతో నేటికి జరిగే పొిరాటాల్లో
ఆరని  దుష్పరిణమాణాల గతపు ఛాయలు.॥

స్త్రీ లకు మాన- ప్రాణ రక్షణలేని సమాజం .
అంతరాలు మరచిన యువత ఆవేశం
వావి వరుసలు మరచిన కామాంధుల క్రౌర్యం.
నామదిలో గుాడుకట్టిన బాధకు నిదర్శనం .॥

నాలో రగిలిన భావాక్షరాల వ్యక్తీకరణ కు
మువ్వన్నె ఝండా ఇచ్చిన  స్ఫుార్తి సందేశం.
కలం అస్త్రంగా సంధించి చేస్తాను అక్షరపోరాటం.
స్వాతంత్ర్యోద్యమకారుల ఘన చరితల విస్ఫోటం.
అగష్ట్ పదిహేనున  మనం ఎగురవేసే ఝండా
చరితతో తర తరాలకు చెరగని ఘన సందేశం,

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.

No comments:

Post a Comment