14.08.2021
వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయస్థాయి కవితల పోటీలు ()*
అంశం : అమ్మ భాష - తెలుగు
శీర్షిక : కమ్మనైన భాష.
అమ్మ కడుపులోనుండి వింటున్న అందమైన భాష
అమ్మ పాడిన లాలిపాటల్లో దాగిన కమ్మదనం.
తెలుగు భాషకే వన్నెతెచ్చిన చనుపాల తీయదనం
వచ్చీరాని నా పలుకుల్లో నిండిన "అమ్మ "అనే భావం ॥
అడుగడుగునా వినిపించే చందమామ కధలుగా
వేమన పద్యాలే నీతులుగా , భరత చరితలే స్ఫుార్తిగా
అమ్మ పలుకే భాషగా , భాష నిండుదనం బాటగా
నాలో నిండిన "తెలుగు వెలుగు "నా "అమ్మ భాష" ॥
"అమ్మా" అన్న పిలుపులో నిండిన వేద సారాలు.
ముక్కోటి దేవతా శక్తుల భక్తి నిండిన భావాలు
పురాణ, కావ్య, కవన పుాదోటల్లో విహారాలు
కమ్మనైన నా తెలుగు భాష నిండిన ఐశ్వర్యాలు॥
అష్ట దిగ్గజాల సాహిత్య సుగంధాలు
దేశ కీర్తిని వ్యాపింపజేసే చల్లని మలయ పవనాలు
కవుల కవన వనాల్లో ఆనంద విహారాలు
నా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పేరు॥
సరళ భాషొిద్యమకారుల పోరాట యుక్తి
నేటి నా తెలుగు అందరినోటా పలికే భావనా శక్తి.
అపురుాప జ్ఞాన వికాశానికి అందుబాటు పలుకు
నా తెలుగు వన్నెల జిలుగు తేనె ఊటల జిలుగు॥
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment