[8/15, 09:00] నెల్లుట్ల సునీత ( ప్రక్రియ సున్నితం. ): శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో
*కవి పరిచయం3*.
--------------------
పేరు పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాము. ఎక్కువగా కీర్తనలు , లలితసంగీతం పాటలు రాసి ట్యుాన్స్ కడతాను . శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో రెండు CD లుగా ఆవిష్కరించేరు. నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం నాకు గర్వకారణం. అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి,(నిత్య సంతోషిణి, నిహాల్ , రమ్యా బెహెరా , సురేఖా ముార్తి , శశికళా స్వామి వంటి గాయకులు ) పుార్వ
గవర్నరు గారైన విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే కొన్ని, శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయ ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను. శతాధి కవుల పుస్తకం లో పది కధకులకు మాత్రమే ఉన్నత స్థానం లభించడం, అందులో నేను రాసిన కధ , కవిత కుాడా ప్రచురిత మవడం, ఆనందంగా అనిపించింది. నమస్తే దినపత్రికలో , సాక్షి పేపర్ , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు ప్రచురింపబడుతుా ఉంటాయి . ప్రతిలిపి లో కధలు కవితలకు సన్మానం అందుకున్నాను. అక్షరయాన్,సభ్యురాలిగా నేగాక.
పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో
బోంబే షణ్ముహ్మానందలో, అన్నమాచార్య కీర్తనలు
పలు అర్కెష్ట్రాల లో ఎన్నో లలిత సంగీతం పాటలు స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు. కరోనా కారణంగా
ప్రస్తుతం "ఆన్ లైన్" కవితల పోటీల్లో ఇష్టపది ప్రక్రియ లో శ్రీమద్భగవద్గీత పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం " బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో పలు పద్యాలే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను ..-
పాడడం , పాటలను స్వరపరచడమే కాక, లలిత-
సంగీత గేయాలను, కీర్తనలను , వర్ణాలను కుాడా రాస్తున్నాను.
నేను రాసిన ఎన్నో కవితలను , కధలను , పాటలను సంకలనాలుగా తీసుకువచ్చే ప్రయత్నం లో ఉన్నాను.
అన్ లైన్ కవితా పోటీల లో
ఇప్పటి వరకు నాకు లభించిన బిరుదులు , పురస్కారాలు.
2020. నాటి బిరుదులు.
---------------------------------
1. సాహిత్య చక్రవర్తి.
(మహతీ సాహితీ కవి సంగమం ).
2. స్వర మయుారి.
(చెన్నుారి సాహితీ వేదిక )
3.వెలుగు దివ్వె.
(తెలంగాణ తెలుగు కళా నిలయం ).
(4.శత తేనియ పురస్కారము .
(తెలుగు తేనియలు సాహితీ వేదిక )
5. మధుర కవి భుాషణ .
( మేఘనా సాహితీ కళా వేదిక).
6. పద ముత్యం బిరుదు.
(రుారల్ డవలప్ మెంట్ సొసైటీ).
7. ఇష్టపది శ్రేష్ట.
(మహతీ సాహితీ ఇష్టపదులు)
8. అద్వైత పురస్కారం.
(ఉస్మానియా తెలుగు రచయితల సంఘం )
2021 నాటి బిరుదులు.
---------------------------------
8. అక్షర ఝరీ రత్న ..2021.
( ఉస్మానియా తెలుగు రచయితల సంఘం)
9.సాహిత్య కళానిధి" బిరుదు.( 2021.)
(నెల్లుట్ల సునీతగారి ఆధ్వర్యఃలో)
10.. రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ .
(నెల్లుట్ల సునీతగారి ఆధ్వర్యఃలో)
11. సమాజ సార్థక్ అవార్డ్ --2020..
(నెల్లుట్ల సునీతగారి ఆధ్వర్యఃలో)
12. విశిష్ట మహిళా శిరోమణి...బిరుదు.2021
(నెల్లుట్ల సునీతగారి ఆధ్వర్యఃలో)
13. రవీంద్రనాథ్ టాగుార్ సేవా పురస్కారం.
(నెల్లుట్ల సునీతగారి ఆధ్వర్యఃలో)
14. కలామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యుాత్ ఎక్స్ లెన్స్ అవార్డు .
(నెల్లుట్ల సునీతగారి ఆధ్వర్యఃలో)
ఇది నా సంక్షిప్త పరిచయం.
----------------------------------
[8/15, 09:04] నెల్లుట్ల సునీత ( ప్రక్రియ సున్నితం. ): మన సున్నితం కుటుంబ సభ్యులు శ్రీమతి పుల్లాబట్ల జగదీశ్వరి మూర్తి గారు
మంచి గాయని కవయిత్రి ఆదర్శ గృహిణిగా... బాధ్యతలను నిర్వర్తిస్తూ...
తన కలం గళం తో సాహిత్య రంగంలో
మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సన్మానాలు సత్కారాలు అందుకోవాలని కీర్తిప్రతిష్టలు గడించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వారం కవి పరిచయం మీ ముందు ఉంచుతున్నాను🙏💐
ఎన్నో బిరుదులు పురస్కారాలు సాహిత్య వేదిక ల కవిత పోటీలో పాల్గొని ప్రథమ బహుమతులు అందుకుంటూ... అన్ని ప్రక్రియలను అలవోకగా రాస్తూ... సాహిత్య రంగంలో ముందుకెళ్తున్నారు
మధురమైన కంఠం చాలా చక్కగా పాడారు మేడం గారు నా గజల్స్ కూడా పాడారు
No comments:
Post a Comment