22/07/2021.
CPK సంస్థ వారి కవితా సంకలనం కోసం ,
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక : అక్షర జ్ఞాన నిధి పుస్తకం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
సాహిత్య వనంలో కవన విహారం .
ఆకర్షణలు నిండు అక్షరాల మధనం.
అర్ధవంతమైన పదాల ఛంధోబద్ధ గమనం.
నవరస గుభాళింపుల నవ్య నందనవనం ॥
నందనవనంలో దివ్య కళా ఖండాలు.
పుటలు నిండు కావ్యాల గ్రంధాలయాలు.
అణువణువు ఆశయాలకు స్ఫుార్తినిచ్చే ధనాలు .
సభ్య ,సమాజ,సాస్కృుతిక, సమానతల కథనాలు ॥
బానిసత్వ పోరాటాల ఉద్యమ చరితలు..
అన్నదాతల ఆకలి చావుల జీవిత సత్యాలు.
ఉద్యమ కారుల దేశ భక్తి నిండు ఆరాటాలు.
భరతమాత రక్షణకై, త్యాగధనుల పోరాటాలు॥
మనవత్వం నిండు మంచి చెడుల మార్గదర్శకాలు
పలు సంస్కృతుల ధర్మ, కర్మా చరణల విలువలు.
సద్ధర్మ- సాంప్రదాయాల సాముాహిక పర్వాలు .
సమత- మమత సమైక్యతల మానవ బంధాలు॥
కలం పట్టిన కవన శ్రామికుల కర్షక ఫలాలు.
పుస్తక పుటల నిండు సత్యాల సజీవ చరితలు.
జ్ఞాన జ్యోతులు నిండు తెలుగు వెలుగులందాలు
సాహిత్య సౌరభాల సుమ సుందర మణి హారాలు॥
సభ్య సమాజ మెళకువల సరళ సాహితీ వేట.
తెలుగు నా జీవిత సోపానాలకు వెలుగు బాట॥
హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment