Saturday, August 7, 2021

జై జవాన్

7/08/2021.
శ్రీ  శ్రీ  కళావేదిక...లో
అంశం : జై జవాన్.
శీర్షిక : దేశభక్తి  , నిండు కీర్తి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర

దేశ రక్షణకై  దేశ భక్తుల త్యాగ నిరతి
శత్రు పోరాటాలతో  జవానుల అమర కీర్తి
ముాడు రంగుల ఝండాలో నిండిన దేశ ఖ్యాతి
ధైర్య -సాహస సంపదకు మన జవానులే సాక్షి ॥

విజయమొా వీర స్వర్గమొా అన్నదే వారి ధ్యేయం
విలువ కట్టలేనిది జవానులైన వారి త్యాగం
కొన ఊపిరితో ఉన్నా కోరుకుంటారు దేశ సౌభాగ్యం
"భారత్ మాతాకు జై "అన్నదే వారి నినాదం ॥

అకలి దప్పులు ఎరుగని ధృడ సంకల్పం
దేశం కోసం వెరవక పోరాడే ఆత్మస్థైర్యం .
ఎండా , వానలకు జడవని మనస్తత్వం
కష్ట- నష్టాల బాటలో  నిత్యం, పోరాటం ॥

భార్యా బిడ్డల  సౌఖ్యమెరుగని జీవితం.
మృత్యుదేవత కౌగిలే వారికి విశ్రాంతి వాసం. ఆపదలనెదుర్కోవడమే జవానుల లక్ష్యం.
దేశభక్తే వారి జీవితాలకు శాశ్వతైశ్వర్యం . ॥

గతుకు రాళ్ళ వేటలో అలుపెరుగని పోరాటం.
 మందు గుళ్ళ బాటలో  రక్షణ లేని  ప్రయాణం
 దేశ రక్షణకై  అంతులేని ఆరాటం .          
దేశ కోసం  "జవాను" జీవితం అంకితం ॥

అందికే  "జై జవాన్ జైకిసాన్  ." అంటుా
చేసేరు "లాల్ బహదుార్ శాస్త్రీ"  నినాదం.
 దేశానికి వెన్నెముకలైన వారికి "జై జవాన్" అంటుా
 మనమందరం  కుడా ఇద్దాం సాదర గౌరవం ॥
 
హామీ:
"జై జవాన్ " కవిత  ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన .


No comments:

Post a Comment