Friday, August 6, 2021

రామప్ప ఆలయ వైభవం

6/08/2021.
ప్రతి రోజుా కవితా పండుగే
ఉమెన్ రైటర్స్ లో..
అంశం : రామప్ప దేవాలయం.
శీర్షిక : రామప్ప ఆలయ వైభవం .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

కాకతీయుల శిల్ప కళా విశ్వరుాప విన్యాసాలు
అపురుాప  కళాఖండాది శిల్ప సౌందర్యాలు
అప్సరసల భంగిమల నలరే అందమైన శిల్పాలు
రామప్ప ఆలయానికి వన్నెతెచ్చిన వైభవాలు ॥

సంగీత  స్వరాలు వినిపించే కంబ నైపుణ్యాలు.
సంస్కృతి ,సాంప్రదాయాలకవి గౌరవ చిహ్నాలు.
నలభై వత్సరాల శ్రమతో రాణించిన కీర్తి కట్టడాలు
తెలంగాణ వైభవానికి వన్నె తెచ్చే నిదర్శనాలు ॥

నీటిపై  తేలియాడు ఇటిక గోడ కట్టడం
ఇసుకపై  కట్టినట్టి మందిరపు  గోపురం
రేచర్ల  రుద్రుని  ఘన ఆలయ నిర్మాణం
అలనాటి శిల్పుల మేటి నైపుణ్యం ॥

కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వారిచే గుర్తింపు గౌరవం
అంతర్జాతీయ టుారిజం స్పాట్గా కొనసాగే యత్నం.
పర్యాటకులనాకర్షించే వందడుగుల శివుని విగ్రహం
రామప్ప గుడి  ప్రత్యేక ఆకర్షణకు నిలయం॥

కొండలు,చెరువులు నిండిన ప్రకృతి అందం
రుద్రేశ్వర దేవాలయంగా పేరుగాంచిన క్షేత్రం.
రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్న దైవం
శిల్పి రామప్ప పేరుతో నిర్మించబడ్డ ఆలయం॥

కేంద్రం గుర్తింపుతో యునెస్కోకు నామినేషన్
ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప వైభవం
పునర్వైభవంతో వెలిగిపోతున్న రామప్ప సోయగం
అధునాతన సదుపాయాలతో అలరారే రామప్ప ఆలయ ప్రాంగణం॥

హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

No comments:

Post a Comment