Monday, August 30, 2021

పాటవెలదులు

శీర్షిక .
శ్రీ కృష్ణ శరణం మమ.
------------------------------
1.
నభము లేలు వాడు            నరుని గాను
అవత రించ  బుానె             అవని లోన
దేవ కింట  బుట్టె                  దేవ విభుడు.
జయము జయము లింక       జగతి లోన  ॥
2.
మాయ లెన్నొ జేసి             మాత వీడి
నందు నింట  జేరె               నగవు తోడ
గోప బాలు జేరి                   గోవు   లేలు
వెన్న దొంగ అతడె               వేద విదుడు ॥
3.
వేడ్క మురళి బట్టి          వేగ బ్రోవ
వెతలు దీర్చి ఇలను        వెలిగు నింప
దుష్ట రక్క సులను          దునిమె ధరణి
ముద్ధు కృష్ణు డౌచు         ముదము తోడ ॥
4.
ధర్మ క్షేత్ర  మందు          ధర్మ మెంచి
అర్జు నుండు వీడ          అస్త్ర  ములను
సార గీత జెప్పె             సరళ ముగను
పార్ధ సార ధతడు         సార్ధ సఖుడు ॥
5.
పాల సంద్ర మందు       పవ్వ ళించి
కుాడి  లక్ష్మి  తోడ          కులుకు వాడు
వేడ్క నిలను వెలసె      నేడు గిరుల
విశ్వ మేలు ఘనుడు    విష్ణు  డతడు ॥
--------------------------------------------------

ప్రక్రియ : పాటవెలదులు...
శీర్షిక
చరణదాసి
--------------

వేల రంగు పుాల  వేడ్క నల్లి
కంస దమను కేతు కంఠ మలర.
క్రిష్ణ నామ మతని నిష్ట తోడ
పుాజ జేతు నిలను పుణ్య మలర ॥

రక్కసులను దునుమ  రామునిగను
గీత బోధ  జేయ    క్రిష్ణునిగను.
భుామి ధర్మ మేల బుద్ధునిగను
అవతరించు వాడు  హరి యతండు॥

యుగము నొక్క జన్మ యుగ పురుషుగ
ధర్మ మేల నతడు   ధర్మ నిరతి
పెక్కు పాప ములను  పెనగి వేయ
ప్రతిన బుాని వచ్చు ప్రభు వతండు ॥

పట్టి వదల నతని  గట్టి గాను.
భక్తి మదిని నిండు  భాగ్య మలర
నమ్మి కొలుతు నతని  నామ ధనుని.
పుాజ లెరుగ పొంద    పుణ్య ఫలము ॥

విషయ లాలసతను   విడువ భువిని
పరమ ఘనుని పాద   పద్మ ములను
నిరత మతని గొలుతు  నిర్మలముగ
నిత్య పుజ్యు డతడు   నిజము సుమ్మి॥

నభము లేలు వాడు            నరుని గాను
అవత రించ  బుానె             అవని లోన
దేవ కింట  బుట్టె                  దేవ విభుడు.
జయము జయము లింక       జగతి లోన  ॥

మాయ లెన్నొ జేసి             మాత వీడి
నందు నింట  జేరె               నగవు తోడ
గోప బాలు జేరి                   గోవు   లేలు
వెన్న దొంగ అతడె               వేద విదుడు ॥

వేడ్క మురళి బట్టి          వేగ బ్రోవ
వెతలు దీర్చి ఇలను        వెలిగు నింప
దుష్ట రక్క సులను          దునిమె ధరణి
ముద్ధు కృష్ణు డౌచు         ముదము తోడ ॥

ధర్మ క్షేత్ర  మందు          ధర్మ మెంచి
అర్జు నుండు వీడ          అస్త్ర  ములను
సార గీత జెప్పె             సరళ ముగను
పార్ధ సార ధతడు         సార్ధ సఖుడు ॥

పాల సంద్ర మందు       పవ్వ ళించి
కుాడి  లక్ష్మి  తోడ          కులుకు వాడు
వేడ్క నిలను వెలసె      నేడు గిరుల
విశ్వ మేలు ఘనుడు    విష్ణు  డతడు ॥
--------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
8097622021.
---------------------------------------------------

No comments:

Post a Comment