Wednesday, September 1, 2021

పంచ చామరం పద్య నిబంధనలు

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
 *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ డా.అడిగొప్పుల సదయ్య గారు*
తేది: *01-09-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *పంచచామరం*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

*నియమాలు*

పంచచామరం:

1.ఇది వృత్త పద్యము.
2.నాలుగు పాదాలుంటాయి.
3.ప్రతి పాదంలో జ-ర-జ-ర-జ-గ అనే గణాలుంటాయి.
4.యతిమైత్రి- 10వ అక్షరము.
5.ప్రాసనియమం ఉంటుంది.

ఉదా:
రచన: డాక్టర్ అడిగొప్పుల సదయ్య

విశాల లోకమేకమైన -వేర్చలేదు మిత్రులన్
కషాయ కాలకూటమైన-కాల్చలేదు మైత్రినీ
రసాల పల్లవంబు మైత్రి-రశ్మి యందు వాడ దే
కసాయి కూడ చీల్చలేడు-కాలుడయ్యి వచ్చినన్

గణవిభజన:

 *వి* శాల /లోకమే/ కమైన/
I  U I  /U I U  / I U I  /
జ     /    ర    /    జ    /
 *వే* ర్చలే /దు మిత్రు /లన్/
 U    I   U / I   U  I   /  U
 ----ర-----/-----జ---/----గ---

*1.పద్య నియమాలను పాటిస్తూ ఐచ్ఛికాంశముగా కనీసం ఒక పద్యం రాయవలెను .*

*2.ఎలాంటి వివాదాస్పద అంశాలను స్పృశించరాదు*

*3.పద్య/ప్రక్రియ లక్షణాలు ఖచ్చితంగా పాటిస్తూ, ముద్రారాక్షసాలు లేకుండా రాయగలరు*

*4.యాంత్రికంగా కాకుండా సృజనాత్మకంగా భావయుక్తంగా కవిత్వీకరించగలరు. సేకరణలకు అవకాశం లేదు.*

*5.ఉ.7-00 గం.లనుండి రాత్రి 9-00 గం.లవరకు మీ అమూల్యమైన రచనలను సమూహంలో పంపగలరు*

*6.ఈవారంలో ఈరోజు పంపే కవితాసంఖ్య 1తో మొదలౌతుంది*

*7.ఇకనుండి వారంలో మూడు రచనలు చేసినవారికి ప్రశంసాపత్రం అందించబడును.ప్రతి ఆదివారం సెలవు.ఆరోజే ప్ర.పత్రాలు అందించబడుతాయి*

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷



*ప్రధాన కార్యనిర్వాహకులు*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment