సాహితీ బృందావన జాతీయ వేదిక నేను సైతం యూట్యూబ్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో,
"ఆజాదీ కా అమృత మహోత్సవ్" వేడుకల సంబరాలలో భాగంగా-
సెప్టెంబర్ 28 భగత్ సింగ్ జయంతి సందర్భంగా
జరుగుతున్న ఆడియొా కవితాసంకలనం కొరకు ,
అంశం : విప్లవ చైతన్యం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
8097622021.
శీర్షిక : రగిలే నిప్పుకణం .
భగత్ సింగ్, రాజ్‌గురు , సుఖ్‌దేవ్‌లు
భారత స్వాతంత్ర్య విప్లవ పోరాటకులు.
అణువణువుా అగ్నికణంగా రగిలే
పదునైన ఆలోచనల స్వాతంత్ర్య ప్రేమికులు
రగిలే నిప్పుకణిక భగత్ సింగ్--
ఆవేశం నిండిన ఆశయ సాధకుడు
విప్లవ భావాల స్వాతంత్ర్యోద్యమకారకుడు
చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన స్ఫుార్తి దాయకుడు
"ఇంక్విలాబ్ జిందాబాద్ "అన్న నినాదాలతో
ఆత్మత్యాగం చేసిన అమర వీరుడు
నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన
భారత స్వాతంత్ర్య జన చైతన్య ధీరుడు.
బ్రిటిష్ దాస్య శృంఖల విముక్తికై
విప్లవ శంఖం పుారించిన
విశ్వజన శాంతి కాముకుడు
ఆత్మ నిర్భరత తో ఆశావాదిగా
జీవించిన దేశ ప్రేమికుడు
అనుకున్న విషయాన్ని ఆచరణలో
పెట్టగలిగే ఆదర్శ ఆశయ భావుకుడు
అణచివేతలతో ఆలోచనలను చంపలేరన్న
ఆత్మనిర్భరతగల ఆవేశ పోరాటకుడు
దేశ సేవే నా మతం దేశ ప్రేమ నా ఆభిమతం
అన్న భారత దేశ స్వాతంత్ర్య కాముకుడు
తిరుగుబాటు భావాలు నిండిన దేశ సేవకుడు
భగత్ సింగ్" స్వాతంత్ర్యోద్యమ విప్లవ నాయకుడు
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన .
_________________________________
No comments:
Post a Comment