Tuesday, October 5, 2021

సమాచార హక్కు చట్టం

తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ                 అనంతపురం వారి ఆధ్వర్యంలో
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సమాచార హక్కు చట్టం-2005 ,(అక్టోబర్ 12వ తేదీ)  సందర్బంగా
కవితల పోటీ కొరకు రాసిన కవిత.

శీర్షిక :   తమ హక్కుల రక్షణ , ప్రజల బాధ్యత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.


అక్టోబర్ 12, 2005 నుండి పూర్తి 
స్థాయిలో అమలులోకి వచ్చిన
సమాచార హక్కు చట్టం .
అటుపై వెలుగులోకి వచ్చిన 
ఎన్నో రాజకీయ కుంభకోణాలు.
వాటిపై ప్రజల సందేహాలను అలవోకగా
తుంగదొక్కుతున్నన కేంద్రం , అడ్డ దారుల్లో
అడిగిన వాడిని అణచివైస్తున్న వైనం ॥

ఎందరో పోరాడి తెచ్చిన 
సమాచార హక్కు చట్టం.
ప్రభుత్వాలకు మాత్రమే 
లొంగిఉన్న ప్రత్యేక ప్రజా చుట్టం. ॥

ప్రభత్వ పరిపాలనలో  లోటుపాట్లను
ప్రశ్నించే హక్కును కలిగించిన చట్టం,
భావ ప్రకటనా స్వేశ్ఛంటుానే 
అడిగిన వాడిని అణిచివేస్తొిన్న దైన్యం
న్యాయానికి సంకెళ్ళు వేస్తున్న  వైనం ॥

అసహాయ ప్రజల లో  అర్ధంలేని ఆవేశం.
రాజకీయ పార్టీల అధికార దుర్వినియొాగం
 నేటికీ కోల్పోయిన ప్రజా స్వాతంత్ర్యం .
హక్కు పేరుతో ఆరని అణచివేతల బానిసత్వం ॥

సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తుా
స్త్రీలు , రైతులు జరుపుతున్న శాంతియుత 
ఉద్యమాలు వత్సరాలు దాటినా జవాబు 
దొరకని ప్రశ్నలై సమస్యలుగా నిల్చిపోయాయి ॥

చట్టాలు అమలులోకి వచ్చినా 
నెరవేరని లక్ష్యాలు ఎన్నెన్నో..
ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిన ఈ
సమాచార హక్కు చట్టం, దుర్వినియొాగాన్ని
ప్రజలు గుర్తించి తమ హక్కులను 
సాధించగలిగే  బాటలో శాంతి పోరాటం 
చేయడం బాధ్యత నిండిన పౌరులుగా 
మన కర్తవ్యం.॥

 హామీ :
నా ఈ  కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన..


 


No comments:

Post a Comment