Sunday, September 19, 2021

శాంతి కేతనం

గౌరవనీయులందరికీ నమస్కారం.
నా  పేరు శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .లో ఉంటాను. 

సాహిత్యానికి సంగీతానికి  సంబంధించిన కార్యక్రమాలంటే చాలా ఇష్టపడతాను. ఆ కారణంగానే  రచనలు చేయడం, పాటలు రాసి, కంపోజ్ చేసి పాడడం లాంటివి చేస్తుా ఉంటాను. ఆ ఉత్సాహంతోనే ఈ రోజు ..

 *సాహితీ బృందావన జాతీయ వేదిక మరియూ నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా
 వారిచ్చిన  "విశ్వ శాంతి" అనే అంశం మీద 
 నేను రాసిన ఈ కవితను మీకు వినిపిస్తున్నాను...*
  
కవిత శీర్షిక  : శాంతిమంత్రం , సర్వులకుా సమ్మతం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .

మారుతున్న మనస్తత్వాల మారణహోమాలు
స్వాతంత్ర్యానంతరం కుాడా సమసిపోని సమస్యలు
కాల్పులు, కొట్లాటల , హింస నిండిన బాటలు
అశాంతి నిండిన భరతావనిలో కన్నీటి గాధలు ॥

రాజకీయ వైఫల్యాల దుష్పరిమాణాలు
హింసాపుారిత సంఘటనలకు ఆనవాళ్ళు
స్వార్ధపుారిత పాలనలో నలిగిపోతున్న జనాలు
ఫలితంగా కోరుకుంటున్న శాంతి సమావేశాలు॥

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో
2008 సెప్టెంబర్ 21,  చరిత్రలో 
నమోదైన.  ప్రపంచశాంతి దినోత్సవం .
సర్వత్రా శాంతివ్యాప్తికై ఈదినం అంకితం ॥

మహాత్మాగాంధీ అహింసా, శాంతిపురస్కారం
సమస్యల శాంతియుత పరిష్కారకులకు ప్రదానం
ఉగ్రవాదాన్ని రుాపుమాపేందుకు ప్రయత్నం 
శాంతిమంత్రం అన్ని సమస్యలనుా రుాపు మాపేతంత్రం॥

ఆవేశంతో  అడుగు, అనర్ధ దాయకం 
ఆలోచన లేనిమాట,  అపార్ధాలకు కారణం
శాంతినిండిన మనస్తత్వం , సర్వులకు సమ్మతం.
సఖ్యతతో మెలుగుతుా ఎగరేద్ధాం శాంతికపోత కేతనం ॥॥








  

No comments:

Post a Comment