మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ వి.టి.ఆర్ మోహనరావు గారు*
సమీక్షణ: *శ్రీమతి.దొంతరాజు విజయలక్ష్మి గారు*
తేది: *15-10-2021: శుక్రవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: : ఇష్టపది.
శీర్షిక నవ దుర్గారుాపిణి.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
నవ రుాపాల వెలసె నవ రాత్రి దుర్గమ్మ
నమ్మిన వారి గాచు నామాల కొలువమ్మ
తెలుగింటి గౌరవం తెలంగణ గౌరమ్మ
భోగాల నిచ్చేటి బోనాలబతుకమ్మ ॥
ఆశ్వీయుజ మాసపు అమావాస్య మొదలుగ
నవరాత్రులు వెలసిన నవ దుర్గ మాయమ్మ .
రోజుకొక్క రుాపము రోజొకలంకారము
అమ్మ అవని గాచెడు అంబ ఈశ్వరీయము ॥
1.బాలత్రిపురసుందరి.
బాలత్రిపురసుందరి భవ్యమైన రుాపము
భావ భక్తి నిండిన భగవతీ స్వరుాపము
శక్తి మంత్ర మహిమలు ముక్తి నిడెడు పుాజలు
ప్రధమ పుాజలందెడు ప్రసన్న మౌ కీర్తులు ॥
2..శ్రీ గాయత్రి దేవి :
ముాల శక్తి మంత్రము మచ్చటైన రుాపము
నీల ధవళ వర్ణము నిత్య దర్శనీయము
గాయత్రీ తేజము ఘన ద్వితీయ రుాపము
త్రిసంధ్యా సమయము త్రిఫల మంత్ర పఠనము
సహస్ర నామ మంత్ర సార పుార్ణ తేజము
ఓజ తేజ సారము మొాక్ష మిడెడు మంత్రము
పంచముఖీ తేజము పంచ భుాత మయముా
ఆయురారోగ్యాది అద్భుత ఫల సారము ॥
3. శ్రీ మహాలక్ష్మి దేవి :
మంగళమౌ రుాపము మాంగళ్య కారకము
మహాలక్ష్మి తేజము మహిమాన్విత రుాపము.
మాన్యాష్ట సిద్ధి కరి మాత తృతియ రుాపము
అష్ట రుాపి అమ్మణి కష్ట నష్ట వారిణి ॥
4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి.
అవని అన్నపుార్ణా అన్నదాయపర్ణా
ఆదిశక్తి శివ సతి అన్న దాన కారిణి
జీవనాధారిణీ జీవకోటి పోషిణీ
క్షుద్బాధా నాశినీ క్షు దర్వీధరి మానినీ ॥
నవరాత్ర్యవతారిణి నాశాత్కలి హారిణీ
ధాన్య కారిణీ ఘని ధరణి క్షామ నాశినీ
శరణాగత వత్సలే శంకరార్తిశమనీ
కాశీ పుర వాసినీ కామదహను భామినీ.
5. శ్రీ లలితాంబా రుాపిణి.
శ్రీ లలితా శివసతి శ్రీకరి గణ పాలిని
అంబ త్రిపుర సుందరి అరుణోజ్వల భాసిని
కామిత ఫలదాయిని కలిమల ఖలు హారిణీ
ఉపాసినీ, సువాసినీ ఉమా అభయ కారిణీ॥
ముని గణ సంసేవిని ముల్లోక పాలినీ
ఖడ్గ మాల ధారిణీ కనక దివ్య భుాషణి
ఇక్షు కోదండ ధరి ఈప్సిత వర దాయినీ
శ్రీ చక్ర వాసినీ స్థిత బిందురుాపిణి ॥
6. శ్రీ మహా సరస్వతీ స్వరుాపిణి.
7.
శ్రీ మహా సరస్వతి శ్రిత జ్ఞాన ప్రదాయిని
అక్షరస్వరుాపిణి అక్ష మాల ధారిణి.
హంస వాహినీ ఘని హంసిని జన జీవని
వాణి వీణా ధరీ వాజ్మయి విశ్వంభరి .॥
7. శ్రీ మహా దుర్గా రుాపిణి.
శ్రీ సింహ వాహినీ శ్రీ దుర్గ భవానీ
దుర్గమాది వారిణీ దుర్గ దుఃఖ హారిణి.
దుర్గమాసురదమని దుర్గముాగ్ర రుాపిణి
సుఖ సౌఖ్య ప్రదాయినీ సుందరి శివ మొాదిని॥
8. శ్రీ మహిషాసుర మర్ధిని.
శక్తి రుాపి శాంకరి ముక్తి దాయినీశ్వరి
మార హరుని రాణీ మంగళీ మనోహరి
మాత శుాల పాణీ మహిషాసుర మర్దని
శీఘ్ర ఫల ప్రదాయినీ వ్యాఘ్ర వాహినీ ఘని॥
9 శ్రీరాజరాజేశ్వరి దేవి అవతారము
అపరాజిత ముార్తీ అంబా జగదీశ్వరి
రాజ రాజేశ్వరీ రమణి చిత్స్వరుాపిణి
శ్యామలే కోమలే శ్యామల శువ గౌరీ
కుంకుమార్చిత పదే కులయొాగిని కౌళిని ॥
పాహి పాహి పార్వతి పరే పవిత్ర జనని
ప్రసిద్ధ కార్య కరణి ప్రసీద పాహి పావని
వంద్య వేద రుాపిణి వర శుభ కాత్యాయని
మంత్ర మాన్యే ధనీ మహిత విజయ కారణీ ॥
No comments:
Post a Comment