Friday, October 15, 2021

ఆధ్యాత్మికత

శీర్షిక : భక్తి తత్త్వం .( ఆధ్యాత్మికత ).

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

ప్రపంచ అతీంద్రీయ శక్తులకు మానవులకు
మధ్యనున్న అవినాభావ సంబంధం భక్తి.
అదే భక్తికి అనుసంధానమై యున్న బంధం ఆధ్యాత్మికం॥.

మనిషి తనను తాను తెలుసుకునేందుకు -మనో
వాక్కాయ, కర్మలచే తనను తానుశుద్ధి   పరచుకొనేందుకు చేయబడిన సాధనాపుారిత తంత్ర-
 యంత్ర, మంత్ర శక్తి సారమే ఆధ్యాత్మికత అనే ప్రక్రియ.॥
 
 దశావతారాల రుాపాలు దశ దిక్కుల శక్తిలో నిండిన
 సాంప్రదాయ, ఆచార -వ్యవవహారాలకు నిదర్శనాలు 
 మహిలో మనుగడ సాగించేందుకు మానవుడు
 ఈ శక్తి సాంప్రదాయాలకు అనుగుణంగా తనను
 తాను మార్చికునేందుకు చేసే ఉపాసనా యత్నమే
 ఈ నవ విధ భక్తి మార్గాలు, ఉపవాసాది తపఃచర్యలు॥.
 
 మనలో ఉన్న నవవిధ వికారాలను , నవ విధ
 భక్తి మార్గాలద్వారా నియంత్రించి , వాటిని సక్రమ 
 పద్ధతిలో వినియొాగించుకొని, స్థిత ప్రజ్ఞతను పొందే
 భావ ప్రయత్నమే భక్తి మార్గము.॥
 
  మనిషి మనుగడలో సృష్టి వైపరీత్యాను తట్టుకునే శక్తిని ఆత్మస్తైర్యాన్ని పెంపిందించుకొనే యుక్తి మార్గాన్ని
 నిర్దేశించే కర్మ యొాగమే ఆధ్యాత్మికతలో 
 నిండియున్న భావ భక్తి  సారము.॥
 
 బుద్ధి బలం, దేహ దారుడ్యం ,శాంత చిత్త 
 ప్రవృత్తులను అలవర్చుకొనేందుకు చేసే తపస్సే
 ఆధ్యాత్మిక భక్తి భావనా చర్యలైన, పుాజలు,
 అచార వ్యవహారాలు , సంస్కృతి  సాంప్రదాయాలు 
 మొదలైనవి.॥
 
 పురాణాది కావ్య గ్రంధ పఠనాలు మానవుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతి కిరణాలతో  
 మార్గ నిర్దేశాన్నిచ్చే  మహానిధి నిక్షేపాలు. 
 
" ఈ ఆధ్యాత్మిక మార్గాలలో నడచి నిష్ణాతుడైన
మానవుడు అతి శక్తిమంతుడై, కామ,క్రోధాది, మద మాత్సర్యాలకతీతుడై..తానే ప్రకృతి,తానే పురుషుడు - అనే శక్తిగా మారి అన్నిటా తానైన దేవతాస్వరుాపమై ప్రకాశిస్తాడు" అనడంలో ఏ విధమైన సందేహముా లేదు అనేది ఆధ్యాత్మికతకు సంబంధించినదైన నా భావన.

No comments:

Post a Comment