Friday, October 15, 2021

మహతీ సాహితీ కవి సంగమంలో కొన్ని కవితలు.

[8/5, 15:41] p3: మహతీ సాహితీ కవిసంగమం
అంశం: సహితమే సాహిత్యం

ప్రక్రియ: ఇష్టపదులు
తేది: 5.8.21

శీర్షిక: సాహిత్యంతో చెలిమి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

మసాకసం: 37
ఈ మాసం కవిత సంఖ్య: 3

1.
సాహిత్య లోకాన సార మౌ గ్రంధాలు
ఎరిగించినవి ఎన్నొ  ఎరుగనీ విషయాలు

పద్యాలు గద్యాలు  పలుకు పాఠాలెన్నొ
 మేధస్సు నిండినవి  మేలైన  నీతులుా
 
 అలరే పురాణాలుా అవి పెద్ద గ్రంధాలు
చదువ సంస్కృతులను  చాటు ఇతిహాసాలు

సాంప్రదాయపు విధులు సరినేర్వవలెనన్న 
చదువు సాహిత్యమే  జగము నెరిగెదవన్న ॥॥

2.
వేల కీర్తులనేలె వేమన్న  పద్యాలు
సుఖపు బాటను జుాపు  శుభాషితమ్ములవిగ ॥

ఛందస్సు నిండినవి చదువ పద్యములెపుడు
కందాల అందాల కడు రమ్యమౌ  యతులు॥

ప్రాస నియమాలతో  ప్రాణమే పోసేరు
కవులు  ధీటులు వారు కనుగొన్న నియమాలు ॥

సద్ధర్మ బాటలుా సంస్కృతుల తేటలుా 
చిట్టి పొట్టీ కధలు చిన్నారులకు నిధులు ॥॥

3
అట్టి సాహిత్యమును  అనవరతము చదువగ
ఉర్రుాతలుాగె మది ఉత్సాహమదె నిండ.

ఆటవెలదుల ప్రాస తేట గీతుల  మాట
కంద, సీసపు బాట  కవుల సాహితి  వేట

అందమౌ సాహిత్య  మందరిని అలరించు
సద్గ్రంధముల చదువు సఖుల మరువ ॥ 

సాహిత్యమే చెలిమి సాహిత్యమే బలిమి
సరి ఈశ్వరీ మాట సత్య మిది ఓ మనుజ ॥॥
[8/6, 17:45] p3: .6/08/2021
అంశం : ఐచ్చికం.

 శీర్షిక  : ఝండా కు వందనం..

మ.సా.క.సం.: 37.

ఆంగ్లేయుల పరిపాలనలో 
భారత ప్రజల అవమానాలు
బానిసత్వపుబాటలో  
ఎదుగు బొదుగు లేని జీవితాలు॥

బ్రిటిష్ వారి ఆధిపత్యానికి
తల వంచిన భారతీయులు.
భారత స్వాతంత్ర్య పోరాటానికై
ఉద్యమ బాటలో దేశ భక్తులు ॥

కోల్పోయినారెందరో ప్రాణాలు 
కొల్లగొట్టబడిన స్త్రీల మానాలు.
పట్టుబడిన వారికి సంకెళ్ళు 
ఎదురు తిరిగినవారి 
తిరిగిరాని  ప్రాణాలు.॥

పట్టుబట్టిన గాంధీజీ నడచిన
బాటలో, ఉప్పు సత్యాగ్రహాలు.
దాండీమార్చ్ తో చేసిన
శాంతియుత పోరాటాలు ॥

"పింగళి వెంకయ్య" చేసిన  
స్వాతంత్ర్య ముక్తి "ఝండా సృష్టి".
"బంకిం చంద్ర చటర్జీ "రాసిన  
దేశభక్తి నిండిన"జన గణ మణ" 
గీతి,  నిండిన ఉద్యమ స్ఫుార్తి.॥

కులమత వివక్షతల నిరసనలు
ముాడురంగుల జండాలో
 సత్యం,ధర్మం శాంతి నిండిన
సమానత్వపు జీవిత సారాలు॥

వెరసి,లభించిన దేశ స్వాతంత్ర్యం
 గాంధీ, నెహ్రూల పోరాటాల ఫలితంం
బానిసత్వ ముక్తి పొందన దినం 
ఆగష్ట్ 15ను, మరువలేదు జనం.॥

నేటికీ జనం జరుపుకుంటున్న 
భారత స్వాతంత్ర్య దినోత్సవం .
ఎగురుతున్న ఝండాకు చేద్ధాం
వందనం,కలసి మనమందరం ॥


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.

  
*************************
[10/7, 06:39] p3: ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కవిత సంఖ్య 2
మ సా.క.సం..37


శీర్షిక  : ముద్దు కృష్ణ .

భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥

శీర్షిక  : బంగారు బతుకమ్మ 

శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీని కేతని  మానినీ
వేల పుాలను జుట్ట వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర జేరి బోనము నీకిడీ
కోరు బంగరు బాట చుాపెడు గౌరి  శ్రీగజ గామినీ ॥

రంగు పుాలిడి స్తోత్ర పుాజిడి రాణి రక్షణ కోరితీ
మత్త కోకిల మంద గామిని మంత్ర ముార్తివి నీవనీ
వేప ఆకుల నిమ్మ  మాలల వేసి వేడెద మొాఘనీ
వేల్పు వైమము గావ రాగదె  వెల్గ మాపురి పావనీ ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
పార్వతీ ప్రియ శర్వు రాణివి పారమేశ్వరి పావనీ 
బోన మెత్తిన వారి బ్రోచెడు  పోగు రాసివి తీరథీ
అమ్మ తొమ్మిది రుాపు లెత్తిన  అంబ అందుకొ హారతీ ॥
[10/7, 20:56] p3: అంశము: *బుద్దుని బాటలో...*
తేది: 7.10.2021
మ సా క సం: *37*
శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత  స్థాపకుడు,  "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥

నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి  జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష  నీడను  పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥

సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము  యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను  ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥

జ్ఞాన బోధ చేయుట  జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా   బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల  అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు  ఆదర్శపు బాటలు ॥

అంటు రోగం కన్న .అధైర్యం  ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు  అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।

ఆచరించని మాట  అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే  మార్గ మదే  కనపడును.
మంచి మాట బాటలు  మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥


పై ఇష్టపదులు నా స్వంత రచనలు.
[10/8, 20:26] p3: అంశం:  ఐచ్ఛికం 
తేది: 01-10-2021
మసాక.సం: 37

కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక:  నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య:  4.

ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥


ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

 శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
 మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
 యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
 కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥
 
భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని 
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************
[10/9, 18:17] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*

పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు*
సమీక్షణ: *శ్రీ కొనింటి రమేష్ గారు*
తేది: *09-10-2021: శనివారము*
దత్తపది:  *గిరిజ- శైలజ-  హేమజ- అగజ* 


దత్తపది:  *గిరిజ- శైలజ-  హేమజ- అగజ* 
పద్య ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా  : కల్యాణ్ : మహారాష్ట్ర 

అంబ ఈశ్వరి ఆది శక్తివి అందు కోనుతి  శాంకరీ
శుంభ దైత్యుని భంజనీ ప్రియ శంభు మొాదిని పార్వతీ
శంభు రాణివి ,సార పుాజలు సాధ్వి జేతు సుమంగళీ
గుంభ నమ్ములు నీదు మాయలు గుమ్మ  శ్రీ"గిరిజా"త్మనే॥ ॥ 

 బిందు రుాపిణి "శైలజా"ఘని బంధ మొాచని పావనీ
 ఇందు లోచని ఇందిరా సఖి  ఈశ్వరాఖిల మొాహినీ
 గంధ లేపని  పాపనాశి సుగంధ హార సుభుాషణీ ॥
 మంద గామిని దుర్గ హారిణి మంత్రమాతృకె మానినీ॥
 
 భామ సుందర భుాషితాంగిని  "హేమజా"మర నాయికా॥
 కామరుాపిణి కాంత కౌళిని కాల రుాపిణి  కాళికా
శ్యామ సుందరి సార సుస్వర స్వాదు మంజుల గాయికా 
కోమ "లాగజ" గామి నీసతి పార్వతీ పర దేవతా ॥ 

కోమలాంగి దశావతారిణి  కోటి సుార్య ప్రకాశినీ
భామ దుర్గతి నాశినీ నమొ పార్వతీ పరమేశ్వరీ ॥
 కామకార్య విలోలినీ శివ కామినీ వర దాయినీ
ధామ శ్రీపుర వాశినీ భవతారిణీ సింహ వాహినీ॥

ఈ పద్యములు న స్వీయ రచనలు.
[10/11, 20:16] p3: చిత్ర కవిత.
శీర్షిక : ఆడతనం ఆడపిలకు శాపం.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021


కలి ఏలుతున్న రాజ్యంలో 
కామాంధుల కుాటమి.
కన్ను మిన్ను కానరాని 
కర్కసుల కామ జ్వాలలలో
క్షణం క్షణం రాలిపోతున్నతున్న
ఎదగని చిరు ప్రాయం.
కర్కశ కామ జ్వాలల్లో
కాలిబుాడిదౌతున్న అడతనం.
ఆడతనం ఆడపుట్టుకకొక శాపం॥
ఎవర్ని నమ్మాలో ఎక్కడ ఎదగాలో
తెలోని పసి బాలల అమాయకత్వం 
బంధువులే రాబందులైన వైనం.
ఇంటింటా అబలల కన్నీటి కథనాలు.
కామ పిశాచానికి బలౌతున్న 
పసి పిల్లలు,అమ్మలు,అక్కలు,చెల్లెళ్ళు.
ఆడవారికి అడతనమే ఒక శాపం ॥
అవకాశమిస్తే అన్నిరంగాల లో 
అందలాలనందుకోగల అత్మ విస్వాసం .
బయటి ప్రపంచంలో 
బావురుమంటున్న మానవత్వం ।
ఆడదాని మనుగడకు 
ఆడతనమే అడ్డౌతున్న శాపం.॥
మేధస్సు నిండిన మనుషుల్లో
మానవత్వం కరువైన  బుద్ధిలోపం.
ప్రపంచం మంతా వావి వరుసలు లేని
పాచి నిండిన నరకకుాపం..
అడపిల్లకు అడతనమే ఒక శాపం ॥
ఇంటి ఆడపిల్ల అక్కరకు రాని చుట్టం.
ఆరక్షణావకాశాలు అందుబాటుకు
తేవలేని అసమర్దతలు నిండిన
పనికిమాలిన  చట్టం.
లింగ బేధాల లైంగిక దాడుల లో 
స్త్రీ లకు ఇంటి రక్షణే కరువైన 
కన్నీటి నిస్సహాయం.
ఆడతనం ఆడదానికి ఒక శాపం.॥
[10/12, 19:13] p3: 12/10/2021

అంశం : వేదవ్యాసుడు.
కవిత సంఖ్య 2.


రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

వేదాలను నాల్గుగా విభజించిన జ్ఞానతడు
క్రష్ణద్వైపాయనునిగ పేరున్న ఘనుడు
భారత, భాగవతాదుల రచియించిన గురుడు.
అష్టాదశ పురాణాలు అందించిన వ్యాసుడు ॥

బాదరాయణునిగా   ప్రసిద్ధి చెందిన వ్యాసుడుక
ఆషాఢ శుద్ధ పౌర్ణమి , వ్యాసుని జన్మదినం 
మహాభారతతాది కావ్య గ్రంధకర్త.
జయకావ్య గ్రంధకర్త , అదే మహాభారత కథ॥

భగవద్గీత  విష్ణుసహస్రనామాది
దివ్య రచనలు  రచియించిన వేద నిధి.
బ్రహ్మ సుాత్రాలలో వేద వేదాంగాలను
నిక్షిప్తంచేసిన వ్యాస కర్త.॥

పతంజలీ యొాగ శాస్త్రలకు అధార కర్త.
విశిష్ట అక్షర భిక్షను మనకిచ్చిన వ్యాస ముార్తి
ఈనాటి నమన ఆధ్యాత్మిక గ్రంధాల సారం
శ్తీ విష్ణ్వావతారుడైన వ్యాసగురుని ప్రసాదం ॥

పరాశర మహర్షి , సత్యవతీల పుత్రుడు
భరత వంశాభివృద్ధి కారకుడు.
శ్రీ విష్ణు  అవతారియైన జ్ఞాన సద్గురువు.
సప్త చిరంజీవుల లో ఒకడైన వ్యాసుడు॥
 
ప్రపంచ వాజ్మయంలో ప్రసిద్ధిచెందిన 
విద్వాంసుడు తానొక్కడే ఐన వ్యాసుడు-
వేద వాజ్మయాన్ని విభజనలు చేసి
క్రమపద్ధతిలో మనకందించిన సార గురుడు.॥

తత్త్వ జ్ఞానాన్ని సార్వజనికం చేసి
అష్టాదశ పురాణ కధలను అందరికీ 
అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ మార్గదర్శి ॥

చిత్త శాంతిని కలిగించే భాగవత పురాణం
పంచమ వేదమైన మహాభారత గ్రంధాలను
రచించిన ఇతిహాస కారకుడు వేదవ్యాసుడు
పరిపుార్ణ తత్త్వ జ్ఞాన గుణ నిధి.॥

ఆత్మ-అనాత్మల   విషయాలను
సరళ శైలి లో బోధించిన తత్త్వోపదేశకుడు.
శివుని గుార్చి చేసిన తపోవరముచే 
సుకమహర్షి వంటి పుత్రుని పొందిన ఘనుడు॥

వ్యాస నామ మొాక వ్యవస్థ, ఒక పీఠము.
ఇరువదిఏడవ వ్యాసునిగా ప్రసిద్ధిచెందిన 
పరాశర పుత్రుని జన్మదినమునే మనము
వ్యాసపుార్ణమగా, గురుపుార్ణమగా.
స్మరించుకుంటున్న దివ్యమైన దినము॥

వ్యాస పీఠము వాజ్మయ పఠనీయ 
దేవతా పీఠము. అచటినుండి 
గణపతి కలమునుండి జాలువారిన
ఆర్షవాజ్మయ  అక్షర జలధారలలో
అధ్యయన స్నానాదులుగావించి 
ఆచరణల ద్వారా పునీతులమవుదాం ॥
        జై శ్రీ వ్యాస గురవే నమః

ఈ కవిత నా స్వీయ రచన.
[10/13, 14:35] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

కవితాసంఖ్య 3.

1.
భాగ్యరాసివి కోమలీకర పాశ శుాల ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ ఫలప్రద యొాగినీ హితకారిణీ
శక్త్య నంతరుణార్ణ వర్ణిణి శాంకరీ సుఖ కారిణీ
ఆద్య వింధ్యనివాసినీజగ ధాధినేత్రి శుభాననీ ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచనవ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పాలయె శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
శుభ్ర వస్త్రమయిా మనోన్మయి సుందరేశుని  భామినీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తిసు మేరు శృంగ నివాసినీ హరుమొాహినీ
మాతమంగళ కారిణీ మహిమాన్వితే మణి భుాషణీ॥
4.
గంధమాలిన మేయశక్తిసు కోటి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసినపారశక్తి స్వరుాపిణీ
ఇందులోచని మందహాసిని ఈప్సితాది ప్రదాయినీ
బిందుమాలిని భాగ్యకారిణి భీతహారిణి  భామినీ ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దేవి దైత్యవి భంజనీ
భవ్య సుందరి కాళికేసుర పుాజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాధరీ
మఠ్యతాళసు గీత మొాదిని మాతహంససువాహినీ ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పాలినీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
కార్యకారణి నిర్విశేషిణి కామకర్షిణి కోమలీ    
ఉర్వితత్త్వ స్వరుాపిణీ ఘన కౌళినీ కుల యొాగినీ॥
[10/13, 16:20] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

కవితాసంఖ్య 3.

1.
భాగ్యరాసివి కోమలీకర పాశ శుాల ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
శక్త్య నంతరుణార్ణ వర్ణిణి శాంకరీ సుఖ కారిణీ
నిత్య నీరద శ్యామలేశుభ నీళ నిశ్ఛల దేహినీ ॥
2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచనవ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
శుభ్ర వస్త్రమయిా మనోన్మయి సుందరేశుని భామినీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీ ఘన సామినీ హరు మొాహినీ
మాతమంగళ కారిణీ మహిమాన్వితే మణి భుాషణీ॥
4.
గంధమాలిన మేయశక్తిసుగాత్రి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసినపారశక్తి స్వరుాపిణీ
ఇందులోచని మందహాసిని ఇందిరావర దాయినీ
బిందుమాలిని భాగ్యకారిణి భీతహారిసు శస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాధరీ
మఠ్యతాళసు గీత మొాదిని మాతహంససువాహినీ ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పాలినీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
కార్యకారణి నిర్విశేషిణి కామకర్షిణి కామినీ    
ఉర్వితత్త్వ స్వరుాపిణీ ఘన ఊర్ద్వలోకనివాసినీ ॥
[10/13, 20:18] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు*
తేది: *13-10-2021: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

కవితాసంఖ్య 3.

1.
భాగ్యరాసివి కోమలీజయ బాల శుార్య ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
ఋగ్య జుర్విధ సామ గానస్వ రుాపి సుందర గాయకీ
అర్ఘ్య పాద్యసు పుాజితే పర మార్ధ మొాక్షకరీ శుభే ॥
 2.
వ్యాఘ్రవాహిని ధుామ్రలోచన వ్యాజకరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి  శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
అగ్ర గామిని ఆది భిక్షుని అర్ధ భాగిని అమ్మణీ ॥
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీఘన శాలినీ హరు కామినీ 
మొాది నీఘన సార సుందర మొాఘ మంజుల భాషిణీ
4.
గంధమాలిన మేయశక్తిసు గాత్రి సుార్యప్రకాశినీ
బంధమొాచనఘొార నాసిన పారశక్తి స్వరుాపిణీ మందహాసిని ఇందులోచని మాతహంససువాహినీ ॥
వంద నీసుర బిందుమాలిని  వారి జాక్షిసు శస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాత్మనే
కావ్య రుాపిణి గాన మొాదిని కామ కోటి విలాసినీ॥
6.
నిత్య నీరద చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పోషిణీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
అత్య నంతసు తీర్థ వైభవ అగ్ని తేజ ప్రకాశినీ
ప్రత్య భిన్న పరాయణీ వర ప్రకృతీపర మేశ్వరీ ॥
[10/15, 10:55] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ వి.టి.ఆర్ మోహనరావు గారు*
సమీక్షణ: *శ్రీమతి.దొంతరాజు విజయలక్ష్మి గారు*
తేది: *15-10-2021: శుక్రవారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: : ఇష్టపది.
శీర్షిక  నవ దుర్గారుాపిణి.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .


 నవ రుాపాల వెలసె  నవ రాత్రి దుర్గమ్మ
 నమ్మిన వారి గాచు  నామాల కొలువమ్మ
 తెలుగింటి గౌరవం తెలంగణ గౌరమ్మ
 భోగాల  నిచ్చేటి   బోనాలబతుకమ్మ ॥
 
ఆశ్వీయుజ మాసపు అమావాస్య  మొదలుగ
నవరాత్రులు వెలసిన నవ దుర్గ మాయమ్మ .
రోజుకొక్క రుాపము రోజొకలంకారము
అమ్మ అవని గాచెడు అంబ ఈశ్వరీయము ॥

1.బాలత్రిపురసుందరి.
బాలత్రిపురసుందరి భవ్యమైన రుాపము
భావ భక్తి  నిండిన  భగవతీ స్వరుాపము
శక్తి మంత్ర  మహిమలు ముక్తి నిడెడు పుాజలు 
ప్రధమ పుాజలందెడు ప్రసన్న మౌ కీర్తులు ॥

2..శ్రీ గాయత్రి దేవి :
ముాల శక్తి మంత్రము  మచ్చటైన రుాపము
నీల ధవళ వర్ణము  నిత్య దర్శనీయము
గాయత్రీ  తేజము ఘన ద్వితీయ రుాపము 
త్రిసంధ్యా సమయము త్రిఫల మంత్ర పఠనము

సహస్ర నామ మంత్ర సార పుార్ణ తేజము
 ఓజ తేజ సారము మొాక్ష మిడెడు మంత్రము
పంచముఖీ తేజము పంచ భుాత మయముా
ఆయురారోగ్యాది  అద్భుత ఫల సారము ॥

3.  శ్రీ మహాలక్ష్మి దేవి :
మంగళమౌ రుాపము  మాంగళ్య  కారకము
మహాలక్ష్మి  తేజము  మహిమాన్విత  రుాపము.
మాన్యాష్ట సిద్ధి కరి మాత తృతియ రుాపము  
అష్ట రుాపి అమ్మణి  కష్ట నష్ట వారిణి ॥

 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి.
 
 అవని అన్నపుార్ణా  అన్నదాయపర్ణా
ఆదిశక్తి  శివ సతి  అన్న దాన కారిణి
జీవనాధారిణీ జీవకోటి పోషిణీ
క్షుద్బాధా నాశినీ క్షు దర్వీధరి మానినీ ॥ 

నవరాత్ర్యవతారిణి  నాశాత్కలి హారిణీ
ధాన్య కారిణీ ఘని ధరణి క్షామ నాశినీ
శరణాగత వత్సలే   శంకరార్తిశమనీ
కాశీ పుర వాసినీ కామదహను భామినీ.

5. శ్రీ లలితాంబా రుాపిణి.

శ్రీ లలితా శివసతి  శ్రీకరి గణ పాలిని
అంబ త్రిపుర సుందరి అరుణోజ్వల భాసిని
కామిత ఫలదాయిని  కలిమల ఖలు హారిణీ
ఉపాసినీ, సువాసినీ  ఉమా అభయ కారిణీ॥

ముని గణ సంసేవిని ముల్లోక  పాలినీ
ఖడ్గ మాల ధారిణీ  కనక దివ్య భుాషణి
ఇక్షు కోదండ ధరి ఈప్సిత వర దాయినీ
శ్రీ చక్ర వాసినీ  స్థిత బిందురుాపిణి ॥

6. శ్రీ మహా సరస్వతీ స్వరుాపిణి.
7. 
శ్రీ మహా సరస్వతి శ్రిత జ్ఞాన ప్రదాయిని
అక్షరస్వరుాపిణి  అక్ష మాల ధారిణి.
హంస వాహినీ ఘని హంసిని జన జీవని
వాణి వీణా ధరీ వాజ్మయి విశ్వంభరి .॥ 

7. శ్రీ  మహా  దుర్గా రుాపిణి.

  శ్రీ సింహ వాహినీ    శ్రీ దుర్గ భవానీ  
  దుర్గమాది వారిణీ దుర్గ దుఃఖ హారిణి.
  దుర్గమాసురదమని దుర్గముాగ్ర రుాపిణి
  సుఖ సౌఖ్య ప్రదాయినీ సుందరి శివ మొాదిని॥

8. శ్రీ మహిషాసుర మర్ధిని.

శక్తి రుాపి శాంకరి  ముక్తి దాయినీశ్వరి
 మార హరుని రాణీ  మంగళీ మనోహరి
 మాత శుాల పాణీ  మహిషాసుర మర్దని    
 శీఘ్ర ఫల ప్రదాయినీ వ్యాఘ్ర వాహినీ ఘని॥

9 శ్రీరాజరాజేశ్వరి దేవి అవతారము

అపరాజిత ముార్తీ అంబా జగదీశ్వరి
రాజ రాజేశ్వరీ  రమణి చిత్స్వరుాపిణి
శ్యామలే  కోమలే  శ్యామల శువ గౌరీ 
 కుంకుమార్చిత పదే కులయొాగిని కౌళిని ॥

పాహి పాహి పార్వతి పరే పవిత్ర జనని
ప్రసిద్ధ కార్య కరణి ప్రసీద పాహి పావని
వంద్య వేద రుాపిణి వర శుభ కాత్యాయని
మంత్ర మాన్యే ధనీ  మహిత విజయ కారణీ ॥

No comments:

Post a Comment