ప్రతీ రోజుా కవితా పండగే కొరకు-
అంశం..దీపావళి.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక .
నరకాసుర వధ.
ప్రక్రియ: ఇష్టపది .
---------------------
1. వరహావతారునకు వరలు శిశువీతడు
భుాదేవి సుతుడితడు ముార్ఖ నరకాసురుడు ॥
2.
జనకరాజ శిష్యుడు చక్కన్ని పాలకుడు
అసుర లక్షణముగల అహంకార గుణుడు
3
కామాఖ్యను కొలిచెడు కడు భక్తిపరుడితడు
బాణాసుర చెలిమిచే బహు ధుార్త గుణుడితడు
4
దేవీ ఉపాసనల దేహ బలుడాయెను
రాక్షస గుణములతో రాజిల్లుచునుండెను
5
దేవతల నెల్లరను తెగ బాధల బెట్టెను
వర గర్వ బలముతో వదలక హింసించెను
6
ఇందృని పై దాడిడి ఇంద్ర పదవి దోచెను
స్వర్గ మాక్రమించెను స్వర్గ ధామ మేలెను
7
దేవతలే మొరలిడ దేముడభయమిచ్చెను
కృష్ణ సత్య భామలు కృుారు నణచ పోయెను
8
పోరు సల్పె కృష్ణుడు పోరున ముార్ఛిల్లెను
సత్య భామ సాహసియై సమరము సాగించెను
9
భుాదేవి చేతిలో మృత్యుశాప ఫలముగ
నరకాసురు అంతము నరులకు శుభమాయెను
10
నరక చతుర్దశి అది నరకాసురు కధ ఇది
సంతసమున జనులదె సరి పండగ జేసిరి
11
దీప వళుల పేర్చిరి దీపాలలరించిరి
దీపావళి పండగదే దేవతలా వరమిది
12.
సంతసమున జనులదె సందడులను జేయగ
కొలిచి లక్ష్మి దేవిని కోర్కె లడిగి మురిసిరి ॥
స్వర్గ మేల ఇంద్రుడు జనులు సంతసించిరి
శ్రీలక్ష్మి వరముతో సిరులు పొంది మురిసిరి ॥
-------------------------------------
No comments:
Post a Comment