Sunday, October 24, 2021

SN సాహిత్యం కొరకు దీపావళి కథ

SN సాహిత్య విభాగం...కొరకు

అంశం..దీపావళి.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
శీర్షిక : నరకాసుర వధ కథ.

వరాహావతారుడై వరలు మహా విష్ణువుకు-
భుాదేవికిని సుతుడు ముార్ఖ నరకాసురుడు ॥
అసుర లక్షణములుగల అహంకారుడీతడు
చక్కన్ని పాలకుడు జనకరాజు శిష్యుడు॥
కడు భక్త చిత్తుడు  కామాఖ్య భక్తుడు.
బాణసుర చెలిమి తో బహు ధుార్తుడైనాడు॥
దేహబలము పొందిన దేవ్యోపాసకుడితడు
రాక్షసాది  గుణములచే రాజిల్లు బలుడు ॥
దేవతలెల్లరను పట్టీ బాధించెను ధుార్తుడు
వరగర్వ బలముచే హింసించెను నరకుడు॥ 
ఇంద్రపదవి నాశించి ఇంద్రుని ఓడొంచెను
స్వర్గమునే దోచెను  స్వర్గ ధామ మేలెను ॥
దేవతలే మొరలిడగా క్రిష్ణుడవతరించెను
సత్య భామ సహితుడై సమరము సాగించెను॥
పోరున శ్రీకృష్ణుడు అలసి సొలసి తుాలెను
సాహసియౌ సత్యభామ సమరము సాగించెను ॥
భుాదేవీ శాపమే భువికి శుభమదాయెను
మృత్యు శాపగ్రస్తుడైన నరకసురుడు కుాలెను ॥
నరకచతుర్దశినాటి నరకాసుని వధ కధ
సత్యభామ కృష్ణుల అవతారపు ఘనత.
సురులు దీపవళులు పేర్చి శుభ గీతులు పాడిరి
దీపాల పండగదే భువిని జనులు చేసిరి ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.


No comments:

Post a Comment