[10/15, 16:29] +91 6305 543 917: మిత్రులకు సాహితీ వందనం....
ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో 'సురారం శంకర్' గారి 'సౌపర్ణిక' గజల్ సంపుటి పై నేను రాసిన సమీక్ష.....తప్పకుండా చదవండి....
పత్రిక యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు...🙏
🌷 హృదయ కాంతుల మెరుపు సౌపర్ణిక 🌷
శబ్ద సౌందర్యంతో కూడిన కవిత్వం వినసొంపుగా ఉంటుంది...
అందులో అద్భుతమైన భావం ఇమిడి ఉంటే మనోహరంగా ఉంటుంది....
లయగా సాగుతున్న కవిత్వాన్ని చదువుతున్నప్పుడు....పెదవులు పాటలాగా పాడాలని మారాం చేస్తాయి...మనసైతే భద్రపరచుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది...
గజల్ ప్రక్రియకు ఈ అద్భుతమైన లక్షణాలన్నీ ఉన్నందువల్లేమో కవులు తమ భాషల్లో గజల్ సౌందర్యాన్ని ప్రవహింపజేస్తున్నారు....
గజల్ మొదట అరబ్బీ, పర్షియన్ భాషల్లో మొదలైనా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది...ఇది మాత్రా ఛందస్సు తో కూడిన ప్రక్రియ....
పంక్తుల జతను షేర్ అంటారు. మొదటి షేర్ ను మత్లా....చివరి షేర్ ను మక్తా అంటారు...చివరి షేర్ లో రచయిత తన పేరును చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది....దీనిని తఖల్లుస్ అంటారు...ఆ పేరు కూడా భావంలో ఇమిడి పోవాలి...
గజల్ లోని భావవ్యక్తీకరణలో చమత్కారం ముఖ్యం...గజల్ లో వస్తువు ముఖ్యంగా ప్రేమ, విరహం , తాత్వికత ఉంటుంది...విరహాన్ని మరీ దుఃఖిస్తున్నట్లుగా కాకుండా కాస్త ప్రేమలో ముంచి రాస్తే మరింతగా గుభాళిస్తుంది....
ఇప్పుడు 'సౌపర్ణిక' లోని కొన్ని షేర్లను పరిచయం చేస్తున్నాను
//మనసును ఎందుకు మరిమరి మరిమరి భ్రమ పెట్టుకుంటామో తెలియదు
'చిరుగును' చూసి 'చిగురని' ఎందుకు ఒప్పేసుకుంటామో తెలియదు//ఈ మత్లా లో మనసు పడే వేదన గురించి హృద్యంగా రాశారు....ఒక్కోసారి కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా...మనం ఒప్పుకోము...మనకు నచ్చిన విధంగానే జరుగుతున్నట్లు భ్రమలో ఉంటాము...అలాంటప్పుడే చిరుగులు కూడా చిగురులుగా కనిపిస్తాయి...కానీ ఇది కూడా గాయ పడిన మనసుకు ఊరటే....
//నిలిచిపోయే పాటనే ఇల 'రాసి' వెళతాను
గుండె మీటే మాటకే 'ఓటేసి' వెళతాను
సత్యమేదో తెలిసినాక సంకెలల బ్రతుకెందుకు
స్వార్థ చింతన నిక్కడే 'వదిలేసి' వెళతాను//...ఈ గజల్ లో మంచి తాత్వికత ఉంది...
మన జీవితం ఎప్పుడూ ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి...మనం ఇంక లేము అని తెలిసినప్పుడు మన మాటలు మన మంచితనం కొన్నాళ్ళ వరకైనా అందరికీ గుర్తుండి పోవాలి. అందుకే మనిషి స్వార్థాన్ని వదులుకోవాలని కవి అంటున్నారు....ఇందులోనే నాలుగవ షేర్లో ఇలా అంటున్నారు...
//కోటి జన్మలు ఎత్తినా, ఈ కోరికల సడి తీరునా?
సంతృప్తి పాదును ఇప్పుడే 'సరిచేసి' వెళతాను// ....ఎంత గొప్ప భావం....మనిషిలో కోరికలెప్పుడూ సడి చేస్తూనే ఉంటాయి , అందుకే మనం ఉన్న దాంతోనే సంతృప్తి పడడం నేర్చుకోవాలంటున్నారు....
//చిరునవ్వు కన్నా అందమైన 'స్వాగతం' ఉందా?
బాల్యాని కన్నా మధురమైన 'జ్ఞాపకం' ఉందా?//....చక్కగా చెప్పారు చిరునవ్వు కన్నా మించిన స్వాగతం లేదు అలాగే చిరునవ్వు కన్నా మించిన ఆభరణమూ లేదు...మనసులో ఎంత బాధ ఉన్నా కొద్ది మంది పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరదు...ఒక్కోసారి బాధలను ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఆ చిరునవ్వే ఇస్తుంది...అందుకే చిరునవ్వును ఎవరూ దూరం చేసుకోకూడదు...మోవికి అందాన్ని ఇస్తుంది....అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంక అందులోనే కవి అంటున్నారు బాల్యానికన్నా మధురమైన జ్ఞాపకం ఉందా అని...ఎవరికీ ఉండదు అంతకన్నా మధురమైన జ్ఞాపకం....
//నా పూలతోటలో పూలన్నీ ఎవరో 'త్రుంచుకు' వెళ్ళారు
మధురోహల నా ఏకాంతాలను ఎవరో 'దోచుకు' వెళ్ళారు//...ఎంత అందమైన భావవ్యక్తీకరణ....నా తోటలోని పూలన్నీ ఎవరో తుంచేశారు....అచ్చంగా నేను ఊహల్లో విహరిస్తుంటే నా ఏకాంతాలను ఎవరో దోచుకు వెళ్ళినట్లుగా అంటున్నారు...ఏకాంతాలను పూలతో పోల్చడం ఎంతో బాగుంది.
//ఎపుడో అపుడు నువ్వూ నేనూ 'కలువక' పోతామా?
ఇద్దరి ఎడదల పొగిలిన సుద్దులు 'నుడువక' పోతామా? //....ఎవరికైనా ఈ వాక్యాలు నచ్చుతాయి...
నువ్వూ నేనూ నింగి నేలా ఏమీ కాము కదా కలువక పోవడానికి...ఎపుడో ఒకప్పుడు తప్పక కలుస్తాము ఆక్షణం ఇన్నాళ్లూ మన ఇరువురి హృదయాలలో దాచుకున్న ఊసులన్నింటినీ ఒకరికొకరం వినిపించుకుంటాము....
ఇందులోనే ఇంకో షేర్లో ఇలా అంటున్నారు...
//నీదో గమ్యం నాదో గమ్యం, ఇద్దరి మధ్య అగాధం
అయినా ఒకరికి ఒకరం మనసుని 'చాటక పోతామా' ?// ....నీ గమ్యం వేరు నా గమ్యం వేరు మళ్ళీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధం ఉంది అయినా కూడా ఎప్పటికైనా మన మనసులు మళ్ళీ ఒకటవకుండా ఉంటాయా అని అనడంలో గొప్ప ఆశావాద దృక్పథం ఉంది....ప్రేమ విఫలమైతే చావాల్సిన అవసరం లేదు....ఎదురు చూద్దాం ఎప్పటికైనా కలుస్తామనే ఆశతో....లేదా మనసులో ఉన్న వాళ్ళ జ్ఞాపకాలతోనైనా జీవిద్దాం...
//జాబిల్లికి చెయ్యందిస్తే నీతో కరచాలనమే
హరివిల్లుకు హృదయాన్నిస్తే నీతో నా పరిచయమే//...ఎంత మధురంగా ఉందీ షేర్....ఆమెతో స్నేహం జాబిల్లికి చేయందించినట్లుగా , ఆమెతో పరిచయం హరివిల్లుకు హృదయాన్నిచ్చినట్లుగా ఉంది అంటూ అందమైన పోలికలతో చెప్పారు...
ఇందులోనే ఇంకో షేర్....
//ఈ లోకం పచ్చిక నిండా నీ పద ముద్రలే
చిరుగాలికి ముచ్చట చెబితే నీతో సంభాషణమే//.....ఈ లోకం పచ్చిక నిండా నీ పదముద్రలే అంటే ఆమె నడిచే దారంతా వసంతం పరచుకుంటోందని, గాలితో చెప్పే మాటలన్నీ నీతో మాట్లాడినట్లే ఉంటుంది అనడం లో గాఢమైన అనురాగం దాగి ఉంది....
//ఏ అక్షరానికి తెలియదు తన 'ఉనికి బలమెంతో'
ఏ పావురానికి తోచదు తన 'రెక్కల బలమెంతో' //....
నిజమే కదా అక్షరాలకున్న బలం ఎంతటిదో ఎవరికీ తెలియదు....అదే విధంగా ఎవరి శక్తి వాళ్ళకు ఎప్పటికీ తెలియదు....కాలమే అన్నింటినీ తెలియజేస్తుంది....కొన్ని సార్లు మనం నిమిత్త మాత్రులుగానే ఉండిపోవాలి.
ఈ 'సౌపర్ణిక' సంపుటిలోని ప్రతి గజల్ అద్భుతంగా ఉంది....తేనె ధారల్లో తడిసిన భావన కలుగుతుంది ఎవరికైనా...ప్రతి గజల్ ని రెండు సార్లు చదవాలనిపించేంత చక్కగా ఉంది...
మంచి గజళ్ళు చదువుతుంటే మనసును సున్నితమైన పరిమళమేదో చుట్టుకున్న భావన కలుగుతుంది....ఇంకాసేపు చదవాలనే కోరిక కలుగుతుంది...అచ్చంగా సూరారం శంకర్ రచించిన 'సౌపర్ణిక' గజల్ సంపుటి లాగానే....
మరెన్నో అద్భుతమైన పుస్తకాలను పాఠకలోకానికి అందివ్వాలని కోరుకుంటూ సురారం శంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.
సమీక్షకురాలు
శాంతి కృష్ణ, గుoటూరు.
[10/15, 16:29] +91 6305 543 917: ---( పాత పోస్ట్... ఫేస్బుక్ గుర్తు చేసింది. కొత్త మిత్రుల కోసం మళ్ళీ... ఇదివరకే చదివినవారు అసహనానికి గురి కావద్దని మనవి-------------------)
--------------------
గజల్ తరంగిణి (వ్యాసాలు)
----------------------
--------- " మిథున కవితా వనం " ద్వారా Madam Leela kay & అడ్మిన్స్ పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న ధారావాహికకు స్వాగతం ... ! సు స్వాగతం ... !!
--------- గతవారం తరువాయి----
------------- గతవారం గజల్ ఛందస్సు గురించి కొంత మేర తెలుసుకున్నాం---
------ ఉరుదు గజల్ ఛందస్సు నుండి తెలుగు భాషా పరిమితులకు ఒదిగేంత మేర ఉరుదూ ఛందస్సును మాత్రమే మనం గ్రహించినాము .. అంతకు మించి అనగా పూర్తి స్థాయి ఉరుదూ గజల్ ఛందస్సును ఉన్నదున్నట్లు మనం తెలుగులో ఉపయోగించుకోవడం లేదనీ , ఆ అవసరం కూడా మనకు లేదనీ నా పరిశీలనలో తెలియవచ్చిన నిజం..
ఉదా।।
---------- ఉరుదూలో గణాన్ని " రుక్న్ "మ అంటారు . గణాలను " ఇర్ కాన్ " అంటారు.
------- ఉరుదూ లో 5 మాత్రల గణాలు =2 , ( 1) ఫఊలున్ --- ( తెెలుగులో " య "గణము IUU . ) ఫ=। , ఊ= U, లున్ = U , -----అలాగే , (2) ఫాయిలున్ . తెలుగులో ఇది "ర" గణము UIU ,
---------- 7 మాత్రల గణాలు =5 ,
1) ముస్త ఫయిలున్ UI II U ( తెలుగులో గణము లేదు )
2) మఫయిలున్ IIIU ( do)
3) ఫాయిలాతున్ UIUU (do )
4) ముత్ ఫాయిలున్ U U IU (do)
5) మఫ ఉలాన్ IIIU ( do )
(** Note := పై గణాలలోని గురు లఘువులను నేను తెలుగు భాషా ఛందస్సును అనుసరించి గణించినాను . ఉరుదూ ఛందస్సు ప్రకారం అయితే ప్రతి పొన్ను అక్షరం ఒక లఘువు I గా గణించవలసి ఉంటుంది . అలా రాస్తే కొందరు Confuse అవుతారని రాయలేదు. )
------ పై గణాలతో బహర్ లు ఏర్పడ్డాయి.. అవి సుమారు 19వరకు ఉన్నాయని పెన్నా గారు పేర్కొన్నారు ... అవి వరుసగా --------
1) హజజ్
2) రజజ్
3) రమల్
4) ముత్ కారిబ్
5)ముత్ దారిక్
6) కామిల్
7)వాఫర్
8) మున్ సరహ్
9) ముజారా
10)సరీఅ
11) ఖఫీఫ్
12) ముజత్తాన్
13) ముక్త జబ్
14) తవీల్
15) మదీద్
16) బసీత్
17) జదీద్
18) కరీబ్
19) మశాకిల్
Note := ఇవే కాకండా మాత్రల హెచ్చు తగ్గులతో మరిన్ని బహర్ ఏర్పరచుకున్నారు.
------------- పైన పేర్కొనిన ఉరుదూ ఛందస్సు నిబంధనలు., బహర్ లు పాఠించడంలో మనకు ఏమాత్రం సౌలభ్యత లేదు 1,2 మినహా ---- మరో ముఖ్య విషయం -- ఉరుదూలో పొన్నును ( ్ ) ఒక మాత్ర గా ( అనగా లఘువు గా) లెక్కిస్తారు . తెలుగులో పొన్నును దానికి ముందు ఉన్న హ్రస్వా క్షరానికి కలిపి U గురువు గా గణిస్తాము. దీర్ఘాక్షరం తరువాత వస్తే దానిని కూడా U గా గణిస్తాము. అదే ఉరుదూ లో అయితే దీర్ఘాక్షరం తరువాత వచ్చే పొన్నును ఒక లఘువు I గా గణిస్తారు.....
------- కావున తెలుగు గజల్ రచయితలు ఉరుదూ గజల్ బహర్ ల ఛందస్సు ను మక్కీకి మక్కీ అనుసరించ వలెనన్న నిబంధన ఏమాత్రం అవసరం లేదని నా పరిశీలనకు వచ్చిన విషయంగా నేను భావిస్తున్నాను .
----------- ఇకపోతే , కాఫియా , రదీఫ్ ల సంగతి ....... ?
........ ఇప్పటికీ ఈ విషయంలో చాలా మంది తెలుగుి గజల్ కవులు సందిగ్దంలో ఉన్నట్లు నేను గ్రహించాను .
-------- నిజానికి ఇదేమంత అర్ధం కాని విషయం కాదు. కాస్త శ్రద్ధ కావాలి అంతే-----
----దీనిని శబ్ద బ్రహ్మ డా।। సినారె గారి గజల్ ఉదా।। తో తెలుసుకుందాము----
1) చిన్న దీపమని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది
జనమేం చేస్తుందనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది
2) ఎంత తెగించిన సాహసమో నినదించే ఊరేగింపులకు
వట్టి పిడికిలే అనుకోకు అది చట్టాలను పేల్చే స్తుంది
------------- పై రెండు షేర్ లలో చివరి అంత్య ప్రాసలైన """"" కాల్చేస్తుంది , మార్చేస్తుంది , పేల్చేస్తుంది. కాఫియాలు అవుతాయి . ఈ గజల్ లో రదీఫ్ లేదు. కనక ఇది బేమురద్దఫ్ గజల్ అవుతుంది .
------------- మరో ఉదాహరణ డా।। సినారె గారిదే.
1) అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో
కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో
2) ఏ సిరులూ పొందని సంతృప్తి ఏమిటో
కళాసరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో
4) నిట్టూర్పు సెగల్లో గీపెట్టే మౌనం
ఉబికే సుడిగాడ్పులోన ఒదిగి తెలుసుకో
---------- పై షేర్ లలో ---- మత్లా లోని పాదాల చివరి రెండు పదాలు " తెలుసుకో " , అలాగే 2) , 3) షేర్లలోని రెండవ పాదం చివరి పదాలు " తెలుసుకో " అనేవి '" రదీఫ్ " లు అవుతాయి .
-------- మరి కాఫియాలు ఏవి ?
-------- మత్లా పాదాంతంలోని రదీఫ్ (తెలుసుకో )కు ముందు వాడిన ----- 1) అడిగి , కరిగి మిగిలిన 2వ షేర్ లోని రెండవ పాదంలోని రదీఫ్ (తెలుసుకో )కు ముందు పదమైన "కడిగి .""" 3) వ షేర్లో రెండవ పాదం చివరి పదమైన రదీఫ్ ( తెలుసుకో )కు ముందు పదమైన "ఒదిగి"" కాఫియాలు అవుతాయి...
--------- రదీఫ్ లేకుండా రాసే గజల్ల ను , బేమురద్దఫ్ , లేక గైర్ మురద్దఫ్ గజల్లంటారు.. ఎలా రాసినా భాష , భావుతలను జోడు గుర్రాల్లా నడిపించగలగాలి .
------ ఇంకా ఉంది ,
---------- ఈ వారం గజల్ తరంగిణి ని తెలుగు గజల్ మహాకవి డా ।। సినారె గారి కి స్మృత్యంజలిగా సమర్పించుకుంటూ శలవు తీసుకుంటున్నాను...
------- వొచ్చే వారం మరిన్ని వివరాలతో మీ, ముందుంటాను. .... ఆదరిస్తున్న అందరికీ నమస్సులతో --
-- మీ సూరారం శంకర్. 16.06.2017.
[10/15, 16:58] +91 6305 543 917: గజల్ పుట్టిందే సూఫీ తత్వం లో.సూఫీ తత్వం అంటే భగవంతుడు నిరాకారుడు. సూఫీ తత్వం లో ఇక్కడ వున్నాడు.అక్కడ లేడు అనే ప్రశ్నే లేదు.మనం ఎందులో భగవంతుని చూడా లనుకున్నా అందులోనే ఉంటాడు. *ఋగ్వేదంలో.. ఏ కం తత్ విప్ర బహుదా వదంతి* అంటే భగవంతుడు ఒక్కడే! అనేక రూపాలలో చెబుతాం!ఇది ఇస్లాం తత్వం కు పూర్తి వ్యతిరేకం.*లా ఇలా హి ఇల్ల లాహ్*..అల్లా ఒక్కరే! మనం చేసే ప్రతి పూజ అందుకునే వాడు ఆ అల్లా ఒక్కడే. ఇస్లాం తత్వంలో అల్లా ఒక్కడే దేవుడు...సూఫీ తత్వం లో *అల్లా* అనే ప్రశ్నే లేదు. రమాదేవి లో వున్నాడు.మీలో వున్నాడు.మీరు ఎవరిలో చూస్తే వారిలోనే భగవంతుడు ఉంటాడు . అదే కదా మన.భారతీయ సిద్ధాంతం కూడా!
[10/15, 16:59] +91 6305 543 917: మీరు ఎవరో గానీ తెలుసుకోవాలనే తత్వం ఉన్నందుకు అభినందనలు! విజయ దశమి శుభాకాంక్షలు!🌷💐🙏🏿💐🌷👌
No comments:
Post a Comment