Monday, October 25, 2021

అమ్మకానికి అమ్మ

మహతీ సాహితీ కవి సంగమం
అంశం: ఐచ్ఛికం.
తేది: 01-10-2021
మసాక.సం: 19
కవిత సంఖ్య 4.
కవి పేరు: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఊరు:  కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక:  అమ్మకానికి అమ్మ.
ప్రక్రియ:  వచన కవిత .

కౌరవ రాజ్యంలో కార్చిచ్చు.
కనీ వినీ ఎరుగని వింతలుా
విడ్డుారాలు.॥
అమ్మతనం లో ఆడతనం
చుాసిన ఊర నక్కలు.
బోసినవ్వుల పాపలను కుాడా
విడిచిపెట్టని కామాంధులు.॥
కుటిల  కృార చేష్టలతో
కులహీనులౌతున్న నేటి యువత.
ప్రశ్న వేస్తే పెట్రేగుతున్న ఘనత ॥
నాల్కనే కత్తి వేట్లతో
కుంటిదౌతున్న పెత్తనం.
పనికిరసని చెత్తగా 
పారవేయబడుతున్న వ్రద్ధాప్యం ॥
ఆత్మహత్యల ఊబిలో అన్నదాతలు.
నీతి నియమాలు మరచిన ప్రజలు.॥
అవక తవకల ఆగ్రహాలకు
ఆహుతౌతున్న  అమాయకులు.॥
మార్పు మార్పంటుా నరమృగాలుగా
మారుతున్న మనుషులు .॥
మారిన మనస్తత్వాలు చేస్తున్న
మారణహోమాలు.॥
మాడి మసౌతున్న నీ, నా బంధాలు.
జాతి మత భేదాల భేరీ నినాదాలు.॥
రక్తపు దారుల్లో మొాగుతున్న
మరణమృదంగాలు.॥
కళ్ళుముాసుకున్న కేంద్ర పాలనలో
పెట్రేగుతున్న రౌడీ నాయకుల ఆగడాలు॥ .
అసంతృప్తి నిండిన జనాల్లో
కోలుకో లేని అర్ధాంతర చావులు ॥
శాంతి నిండిన ఉద్యమ
దారుల దాడుల్లో ఆహుతౌతున్న 
అమాయక జనాలు॥
భరత మాత ఒడి నిండిన
బంజరు భుామిలో కన్నీటి సేద్యం ॥
న్యాయ ధర్మాలు అంతరించిన
దేశంలో,ఆత్మబలం లోపించిన చోద్యం ॥
పరదేశం పట్టుకు పాకులాడుతున్న
పాపుల్లారా.. రండి రండి
పనికిమాలిన మా దేశ మాత ప్రగతి
వేలం వేయబడుతోంది. రండి రండి
అవకాశాలన్నీ మీకే...
మా నోరు పక్షవాతంతో
పక్కదార్లు పట్టి పడిపోయింది.
మాట్లాడేవాడులేడు..రండి రండి.
మా అమ్మ అమ్మకానికుంది.







No comments:

Post a Comment