మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితాపండుగే
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: *శ్రీ దాసరి చంద్రమౌళి గారు
సమీక్షణ: *శ్రీ టిఆర్ కె కామేశ్వరరావు గారు
తేది: *18-10-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
క్రమ సంఖ్య : 37.
కవిత సంఖ్య : 1.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
పద్య ప్రక్రియ : ఆటవెలది.
అంశం :మనిషి -మేధస్సు .
శీర్షిక : ఓ మనిషీ , మేలుకో...
మేధ నిండు మనిషి మెట్టు మెట్టుగజేరె
చంద్ర మండ లమ్ము జక్క గాను
తెలివి మీరు పనుల దెలియలే దతనికి
బతుకు దుర్భ రమ్ము భార మగుత ॥
ఏమి ఫలము వచ్చె అంతరిక్షము జుట్ట
సెట్టు లైట్లు పెరిగె గుట్టు లుడిగె
అంతర్జాల మహిమ అన్ని వెల్లడులాయె
బుద్ధి తరిగె మనిషి శుద్ధి మరచె ॥
అడవి రాజ్య మాయె అశ్లీలతే పెరిగె
కామ వాంఛ పెరిగె కలత పెరిగె
చంద మామ కధల జగతి నీతులు మారె
చెడుపు జేరె నిలను చెదిరె బ్రతుకు ॥
విజ్ఞానమును పెంచి విశ్వమంతయు జుట్టి
వివిధ రీతు లతడు విర్ర వీగె
చెట్లు గొట్టి యతడు చేయగా శోధనా
ప్రాణ వాయు లేక ప్రజలు జచ్చె ॥
పెరిగె కాలు షమ్ము తరిగె భుాసారమ్ము
యంత్ర హోరు పెరిగె యవని లోన
పనులు మానె జనులు పరికించ నీరింకె
పంట పొలము లెండి పతన మాయె ॥
కోటి విద్య లేల కోరుబ్ర తుకులేని
ఉద్ధ రింప వయ్య నుర్వి నీవు
భువిని మట్టు పెట్టి భువనమ్ము లేలేవు.
ధరణి నుద్ధ రించు ధర్మ మదియె ॥
జ్ఞాన మార్గ మదియె జనహిత మౌమాట
కష్ట నష్ట ములవె కరుగ జేయ
విద్య విత్తు వేసి విజ్ఞాన మును పెంచు
విజయ బాట లేలి వినుతి కెక్క ॥
ప్రస్తుత పరిస్థితుల బట్టి
రాసిన ఈ పద్యాలు నా ద్వీయ రచనలు.
No comments:
Post a Comment