మహతీ సాహితీ కవి సంగమం లో
*బతుకమ్మ ఈ-కవితాసంకలనం*కొరకు
శీర్షిక బోనాల భోగాల బతుకమ్మ గౌరి.
మా ఇంటి మహలక్ష్మికి తోడైనా సఖియ
బంగారు బతుకమ్మ సుమగంధ నిలయ
అర్తులను గాచేటి కరుణాల వలయ.
సిరిమల్లె మాయమ్మ హిమవంతు తనయ
తెలంగాణ సంస్కృతికి గురుతైన తల్లి
రంగుపుాల వలువలిడిన నిండుపసుపు గౌరి
తొమ్మిదైన రుాపాల దుర్గా కాత్యాయని
బోనాల భోగాల నారగించు పావని
అట-పాటల వెల్గునాతల్లి ముఖము
అర్తజనుల నేలేటి అభయమిచ్చెడి కరము
అశ్వీయుజ మాసమున తల్లికీయ స్వాగతము
పసుపు కుంకాలమల్లి ఫలమిచ్చు దైవము ॥
కష్టాలను కడతేర్చగ కాళివై రావమ్మ
నిమ్మపండ్ల హారాల నిండైన కొమ్మా
నిలువెత్తు నీరాజనమందుకోవమ్మా
మహిగాచే మంగళివి మమ్మేలుమమ్మా
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021
No comments:
Post a Comment