శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత స్థాపకుడు, "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥
నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష నీడను పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥
సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥
జ్ఞాన బోధ చేయుట జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు ఆదర్శపు బాటలు ॥
అంటు రోగం కన్న .అధైర్యం ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।
ఆచరించని మాట అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే మార్గ మదే కనపడును.
మంచి మాట బాటలు మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥
No comments:
Post a Comment